కరోనా మహమ్మారి మొదటి, రెండో వేవ్ అంటూ దేశంలో అల్లకల్లోలం సృష్టించింది.ఇప్పుడు మూడోవేవ్ కూడా వస్తుందని అంటున్నారు. ఇప్పటికే కరోనాను అరికట్టేందుకు దేశంలో రెండు వ్యాక్సిన్లు వచ్చాయి. వాటిని సమర్థంగా ప్రజలకు వేస్తున్నారు. ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. చాలా మందికి రెండు డోసులు పూర్తయ్యింది.
అయితే రెండు డోసులు టీకా తీసుకున్న వారికి కూడా మళ్లీ కరోనా సోకుతోందని తేలింది. ప్రాణాలకు ప్రమాదం లేక బలహీనం చేస్తోందని.. కొందరిని ఆస్పత్రి పాలు చేస్తోందని తేలింది.
ఈ క్రమంలోనే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు మూడో బూస్టర్ డోస్ ఇవ్వాలని అది తీసుకుంటే ఇక జన్మలో కరోనా రాదన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ మరో వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వ్యక్తి మళ్లీ కోవీషీల్డ్ తీసుకోవచ్చా? ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఒకసారి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయ్యాక మరోసారి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని తెలిపింది.
ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి తనకు కోవీషీల్డ్ వేయాలని కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే రెండు డోసులు తీసుకున్నాక మరో వ్యాక్సిన్ వేయడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.
రెండు డోసులు ఒక టీకా తీసుకున్నాక మరో టీకా తీసుకుంటే డేంజర్ అని కేంద్రం తెలిపింది. కేంద్రం డబుల్ టీకా వేసుకోవడం కుదరదని తేల్చిచెప్పింది. అలావేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని తేల్చిచెప్పింది. అనారోగ్యానికి దారితీస్తుందని తెలిపారు.