మన దేశంలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభించనుంది. నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్ స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా) తాజాగా కరోనా థర్డ్ వేవ్ పై కీలక హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ లో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. అప్పుడు కరోనా బారిన పడిన ప్రతీ 100 మందిలో 23 మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయని అంచనా వేసింది. అందుకే ఈ పరిస్థితులకు ముందుగానే దేశంలో రెండు లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాలని సూచింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రానున్న కరోనా దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగానే అప్రమత్తమవుతూ, వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని సూచింది.
దాదాపుగా 2 లక్షల ఐసీయూ బెడ్లతో పాటు 1.2 లక్షల వెంటిలేటర్ కలిగిన ఐసీయూ బెడ్లు, 7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు కలిగిన బెడ్లు, 10 లక్షల కోవిడ్ ఐసోలేషన్ కేర్ బెడ్లు సిద్ధం చేయాలని తెలిపింది. నీతి ఆయోగ్ దీనికి ముందుగా 2020 సెప్టెంబరులో కరోనా సెకెండ్ వేవ్ గురించి హెచ్చరించింది. ఈసారి కూడా థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. కాగా దేశంలో గడచిన 56 రోజులుగా 50 వేలకు దిగువగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. గడచిన 24 గంటట్లో దేశంలో కొత్తగా 30,948 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 403 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 4 లక్షల 34 వేల 367కు చేరింది. ఇప్పుడు వస్తున్న కేసుల్లో 50శాతానికి పై వాటా కేరళకే చెందుతోంది. ఈ పరిణామాల్లో అక్టోబర్లో మూడో వేవ్ పతాక స్థాయికి వెళ్లవచ్చని ఈ అధ్యయనం అంచనా వేసింది.
థర్డ్ వేవ్ పిల్లల పై ప్రభావం చూపుతుందని చాలా మంది భయపడుతున్నారు. అయితే , తాజాగా నీతి ఆయోగ్ కూడా కరోనా థర్డ్ వేవ్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలని కోరింది. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గలేదు. దేశవ్యాప్తంగా కేసులు వస్తూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ వచ్చినా మధ్యస్థంగానే ఉండొచ్చు. దేశవ్యాప్తంగా రోజుకు కోటి డోసుల లెక్కన వ్యాక్సిన్ వేస్తే.. డెల్టా వేరియేషన్ కూడా సమస్య కాకపోయేది. ప్రస్తుతం రోజుకు 40 లక్షల డోసులే వేస్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్‌ను బయోలాజికల్ ఇవాన్స్ మొదలుపెట్టనుంది. త్వరలోనే జైడస్‌కు కూడా అనుమతి వస్తే మరో నెల రోజుల్లో టీకా కార్యక్రమం వేగవంతం అవుతుంది. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచితే అప్పుడు కరోనా తగ్గే అవకాశం ఉంది.
కోవిడ్ జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వందలాది మంది చేరడం వంటి కారణాలతో ఇంకా కేసులు పెరుగుతున్నాయి. 80% మందికి ఇమ్యునిటీ వస్తేనే ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ఏర్పడి డెల్టా వేరియెంట్ పూర్తిగా పోతుంది. కొత్త వేరియెంట్లు కూడా రావు. మన దగ్గర డెల్టా ప్లస్ ఎక్కువగా లేదు. యాంటీ బాడీస్ పెరిగిన వారిపై కరోనా ప్రభావం చూపట్లేదు. కొందరు టీకా తీసుకున్నా కూడా యాంటీబాడీస్ ఏర్పడట్లేదు. అలాంటి వారిలో ఈ వ్యాధి సీరియస్‌గా మారే అవకాశాలున్నాయి. సెకండ్ వేవ్ అంత సీరియస్‌గా థర్డ్ వేవ్ ఉండదనే అంచనాలున్నాయి. ప్రధాన నగరాల్లో బాగానే ఉన్నా చిన్న పట్టణాల్లో కొంత నిర్లక్ష్యం కన్పిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, గాలి బాగా ఆడే ప్రదేశాల్లో ఉండటం, మూసి ఉన్న ప్రదేశాల్లో గుంపులుగా చేరకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.