పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. దాని స్థానే అంతకు మించిన పెద్ద నోట్లను మార్కెట్లోకి వదిలిన వైనం తెలిసిందే. రూ.వెయ్యి.. రూ.500నోట్ల చలామణిని రాత్రికి రాత్రి ఆపేస్తూ.. షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్న మోడీ సర్కారు పుణ్యమా అని.. గులాబీ రంగులో ఉండే రూ.2వేల నోటును కొత్తగా చలామణిలోకి తీసుకురావటం తెలిసిందే. కొంతకాలం పాటు రాజ్యమేలిన రూ.2వేల నోట్లతో వ్యాపారులు.. ప్రజలు పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. సగటు జీవి జీతం ఐదు నోట్లకు తగ్గిపోయినట్లుగా చేసిన ఈ నోట్లను జేబులో పెట్టుకొని మార్కెట్ కు వెళితే.. చిల్లర ఇవ్వటానికి వ్యాపారస్తులు చుక్కలు చూపించేటోళ్లు.
అలాంటి రూ.2వేల నోట్లు ఈ మధ్యన బొత్తిగా కనిపించటం మానేశాయి. బ్యాంకుల్లో సైతం కట్ట రూ.2వేల నోట్ల కోసం రెండు.. మూడు రోజుల పైనే పట్టే పరిస్థితి నెలకొంది. వ్యూహాత్మకంగా రూ.2వేల నోట్లను క్రమంగా చలామణి నుంచి వెనక్కి తీసుకునే దిశగా ఆర్ బీఐ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందుకు తగ్గట్లే రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను నిలిపేశారు. కొంతకాలంగా రూ.2వేల నోట్ల ముద్రణను ఆపేసిన ఆర్ బీఐ.. అదే సమయంలో మార్కెట్లో చలామణిలో ఉన్న నోట్లు బ్యాంకుల వద్దకు వచ్చినంతనే తిరిగి మార్కెట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొంటోంది. ఈ కారణంతోనే 2021 మార్చి నాటికి దేశంలో 245 కోట్ల రూ.2వేల నోట్లు చలామణిలో ఉంటే.. ఇప్పుడది 214 కోట్లకు తగ్గినట్లుగా గుర్తించారు.
అంటే.. పదమూడు నెలల కాలంలో మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల సంఖ్య 31 కోట్ల నోట్లు తగ్గిపోయినట్లుగా ఆర్ బీఐ చెబుతోంది. దేశం మొత్తమ్మీదా చెలామణిలో ఉన్న మొత్తం రూ.2వేల నోట్లను 17.3 శాతం నుంచి 13.8శాతానికి తగ్గిపోయాయి. అదే సమయంలో రూ.500 నోట్ల చెలామణి భారీగా పెరిగినట్లుగా ఆర్ బీఐ చెబుతోంది.
చెలామణిలో ఉన్న పెద్ద నోట్లతో రూ.2వేల తర్వాత నోటు రూ.500 కావటం.. రూ.2వేల నోట్లను క్రమపద్దతిలో వెనక్కి తీసుకోవటంతో.. అందుబాటులో ఉన్న పెద్ద నోటు రూ.500గా మారింది. 2021 మార్చి నాటికి చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు 3,867 కోట్లు కాగా.. ఈ ఏడాది మార్చి చివరకు ఆ సంఖ్య ఏకంగా 4554 కోట్లకు పెరిగినట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ.500 నోట్లు 34.9 శాతంగా చెబుతున్నారు. రూ.500నోట్ల చెలామణి తర్వాత అత్యధికంగా చలామణిలో ఉన్న నోటు ఏమిటో తెలుసా? రూ.10 నోటు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు అయితే.. వాటి మొత్తం విలువ రూ.31.03 లక్షల కోట్లుగా చెబుతున్నారు. దేశంలో చెలమణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువలో రూ.500 నోట్ల విలువ ఏకంగా 73.3 శాతం ఉండటం గమనార్హం.