తాజాగా వైసీపీ నాయకుడు, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.. ఏపీ సీఎం జగన్‌ను ఏక వచనంతో సంబో ధించడం పై కొన్ని వర్గాల మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగాను, పరోక్షంగా ను నాని ని ఏకేస్తూ.. సీఎం స్థాయి వ్యక్తిని ఏకవచనంతో పిలుస్తావా? అంటూ.. నిప్పులు చెరిగింది. అదేసమయంలో వైఎస్ తో తాను పనిచేశానంటూ.. చెప్పుకోవడాన్ని కూడా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో అసలు పేర్ని నాని ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆయన అంత చొరవ తీసుకున్నారు? అనేదిచర్చకు దారితీసింది.
ఈ విషయాన్ని పరిశీలిస్తే.. పేర్నివెంకట్రామయ్య.. ఉరఫ్ నాని కన్నా ముందు ఆయన తండ్రి గురించి చెప్పుకోవాలి. పేర్ని కృష్ణమూర్తి. ఈయన కూడా మంత్రిగా పనిచేశారు. 1970లలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం ఆయన కాంగ్రెస్ లో చక్రం తిప్పారు. అసమ్మతి లేని నాయకుడిగా..షార్ప్ షూటర్ గా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి వంటివారు.. ఆయన ను గురువుగా భావిస్తారు.
రాజశేఖర రెడ్డి ఇందిరాగాంధీ తో విభేదించి రెడ్డి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినప్పుడు.. పేర్ని కృష్ణమూర్తి రంగంలోకి దిగి.. ఆయనను అనునయించారు. తిరిగి కాంగ్రెస్ పుంజుకునేలా కూడా చేశారు. ఈ క్రమంలో కడపలో ఆయన నెల రోజులు నివాసం ఉన్నారు. అదేవిధంగా ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పేర్ని నాని కూడా.. వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా నే కాకుండా.. తమ్ముడు అని అనిపించుకున్న కోస్తా నాయకుడు.
దీంతో వైఎస్ కుటుంబానికి పేర్ని కుటుంబానికి మధ్య అనుబంధం ఉంది. అంతేకాదు.. జగన్ పాదయాత్ర చేసినప్పుడు కూడా..పేర్ని నాని ఆయన కు సంఘీభావంగా ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర చేశారు. తూర్పులోనూ ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు. కాపు సామాజిక వర్గం సమస్యల అధ్యయనం పై ఆయన కమిటీలో మెంబర్‌గా ఉన్నారు.
దీంతో జగన్ కు ఆయన కు మధ్య అనుంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే చొరవ తీసుకున్నారని.. పేర్ని నాని గురించి తెలిసిన వారు చెబుతున్నారు. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయనివారు చెబుతున్నారు. ఒకటి పార్టీ కార్యకర్తలకు మరింత చేరువ కావడం. రెండు పార్టీ అంటే.. కేవలం జగనే కాదు.. మనందరం అనే సంకేతాలు పంపించడం అనే ఉద్దేశం కూడా ఉందని.. అంటున్నారు. ఏకవచనం అనేది బహిరంగ వేదికలపై ఇప్పుడు కామన్ అయిపోయిందని అంటున్నారు.