‘ట్రంప్ మీమ్ కాయిన్..’ ఇదో గిమ్మిక్కా..? క్రిప్టో మాయనా?

మరొక్క రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అనేక సంచనాలు రేపారు.

Update: 2025-01-18 12:04 GMT

మరొక్క రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అనేక సంచనాలు రేపారు. అసలు ట్రంప్ అంటేనే సంచలనం.. ఇక ఆయన బాధ్యతల్లోకి రాకముందే పనామా కాల్వ, గ్రీన్ ల్యాండ్ అంశాలను టచ్ చేశారు. ఇప్పుడు మరొక కొత్త సంచలనం. అదే ‘ట్రంప్ మీమ్ కాయిన్’. ఇది క్రిప్టో బంగారామా? లేక గిమ్మిక్కా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అది కూడా అతి కొద్ది వ్యవధిలో బాధ్యతలు స్వీకరించనుండగా ఇలా చేయడంపై అనుమానాలు వస్తున్నాయి.

ఇక ట్రంప్ విడుదల చేస్తే చెప్పేదేముంది..? ఆయన కొత్త మీమ్ కాయిన్ మార్కెట్ క్యాప్ మూడు గంటల్లోనే 8 అమెరికన్ బిలియన్లకు చేరింది. వాస్తవానికి ఇలాంటివాటికి చట్టబద్ధత ఉంటుందా? అంటే చెప్పలేం. ఇక్కడ గమనించాల్సింది నాణెం విలువనే. అంతేగాక.. క్రిప్టో సమాజం నుంచి దీనిపై విపరీతమైన ఆసక్తి వ్యక్తమైంది. అదే సమయంలో సందేహాలూ రేకెత్తాయి.

అధ్యక్షుడి సీట్లో కొద్ది కాలం ముందు ట్రంప్ $TRUMP పేరిట కొత్త క్రిప్టో టోకెన్‌ విడుదల చేయడం ఆలస్యం.. అదొక పోటీ కరెన్సీలాగా దూసుకెళ్లడం విశేషం. సహజంగానే ట్రంప్ సొంత సోషల్ మీడియా ట్రూత్ తో పాటు ఎక్స్ లోనూ సంచలనంగా మారింది.

అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలతో నెటిజన్లు కూడా కొంత సంశయానికి గురయ్యారు. ట్రంప్ సోషల్ మీడియా హ్యాక్ అయిందా.? అని కూడా

ఆశ్చర్యపోయారు, ప్రత్యేకించి ట్రూత్ సోషల్ ఖాతాలో పెగ్గి ష్విన్‌ ను డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్‌ పేరు తప్పుగా ఉండడంతో అనుమానాలు బలపడ్డాయి.

ఇక $TRUMP మార్కెట్ క్యాప్ మూడు గంటల్లోనే $8 బిలియన్లకు పెరిగింది. ట్రేడింగ్ వాల్యూమ్‌లు $1 బిలియన్‌ కు చేరుకున్నాయి. నాణెం విలువ నిమిషాల్లో 300 శాతం పైగా పెరిగింది. చివరకు $TRUMP ధర ప్రారంభ $0.18 నుంచి $7.1కి స్థిరపడింది. $TRUMP పెరుగుదలతో ఓ వ్యాపారి గంటలో $20 మిలియన్ల లాభం ఆర్జించారు.

ఆ ఫోటోతోనే..

2024 జూలైలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తూటా ట్రంప్ కుడి చెవి మీదుగా దూసుకెళ్లింది. ఇది పెన్సిల్వేనియాలో జరిగింది. ఆ హత్యాయత్నం నుంచి బయటపడిన తర్వాత ట్రంప్ "ఫైట్, ఫైట్, ఫైట్" అంటూ నినదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు $TRUMP మీమ్ కాయిన్ ఆ నాటి ఫోటోతోనే విడుదలవడం గమనార్హం.

$TRUMP టోకెన్ క్రిప్టో ప్రపంచంలో చర్చనీయంగా మారినప్పటికీ, దాని నిజమైన విలువ- భవిష్యత్తు ఇంకా అనిశ్చితమే. కేవలం ఇది మీమ్ కాయిన్ రంగంలో ఓ అనూహ్య ప్రయాణంగా మిగిలిపోతుందా? లేక డిజిటల్ ఆస్తుల్లో పెద్ద సంచలనంగా మారుతుందా? వేచి చూడాలి. మొత్తానికి ట్రంప్ బ్రాండ్ రాజకీయాలు, వాణిజ్య వస్తువులు లేదా క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో ఆసక్తికరంగానే ఉన్నాయి.

Tags:    

Similar News