తిరుమల వేంకటేశ్వరుడి కొండంటే నిత్య సందోహం... అక్కడ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు... రద్దీ తక్కువ, ఎక్కువ అన్న మాటే కానీ, రద్దీ లేని రోజే ఉండదు. అలాంటి తిరుమల కొండ ఖాళీగా కనిపిస్తోంది. భక్తులు పలచబడి బోసిపోయింది. ముందస్తు బుకింగులు.... మంత్రులు, నేతల రికమండేషన్ లేఖలు ఉంటేనే కానీ అంతోఇంతో సౌకర్యాలు, ఏర్పాట్లు దొరకని తిరుమల కొండపై సులభంగా నిమిషాల్లోనే దర్శనం దొరుకుతోంది.. గదులు దొరుకుతున్నాయి... కోరుకున్న సేవలకు టిక్కెట్లు దొరుకుతున్నాయి. ఇదేంటి... ఎప్పుడూ లేని ఈ వింత అనుకుంటున్నారా... అంతా పుష్కరాల మహిమ... ఈసారి వచ్చిన గోదావరి పుష్కరాలు 144 ఏళ్ల తరువాత వచ్చిన మహా పుష్కరాలని ప్రభుత్వం భారీగా ప్రచారం చేయడంతో ప్రజలంతా అటు అట్రాక్టయ్యారు. తిరుపతి ప్రయాణాలు పెట్టుకున్నవారు కూడా అది క్యాన్సిల్ చేసుకుని గోదావరికి బండి కట్టారు. భక్తులంతా గోదావరి స్నానానికి తరలిపోవడంతో తిరుమల ఆలయానికి వచ్చేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. పుష్కరాలు ముగిసిన తరువాత మళ్లీ ఎప్పటిలా రద్దీ పెరిగిపోతుంది.
ప్రస్తుతం వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 3 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. తిరుమలలో భక్తులు లేకపోవడంతో వెలవెలబోతుంది.. తిరుమల వీదులన్నీ దాదాపుగా ఖాళీగా కనిపిస్తున్నాయి.. భక్తులు హాయిగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారిని దర్శించుకుంటున్నారు.