సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యింది. జగన్ ప్రభుత్వం రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ( ఎస్‌డీఆర్‌ఎఫ్) నుంచి వ్యవసాయ శాఖ కమిషనరేట్ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన నిధులను తిరిగి జమ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను మళ్లించరాదని తేల్చిచెప్పింది. కరోనా నాలుగో వేవ్ వస్తే ఏం చేస్తారని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీసింది. నిధులు లేకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని అని నిలదీసింది. మళ్లించిన నిధులను తిరిగి ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాకు జమ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
కాగా కరోనా నియంత్రణకు వినియోగించాల్సిన దాదాపు రూ.1,100 కోట్ల మేర ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను జగన్ ప్రభుత్వం మళ్లించిందని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా, న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. నిధుల మళ్లింపుపై కాగ్ సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించింది.
అయితే, ఈ నిధులు 2020 మార్చి ముందువని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దానికి స్పందించిన ధర్మాసనం.. నిధులు ఎప్పటివైనా ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను వేరే కార్యక్రమాలకు మళ్లించరాదని స్పష్టం చేసింది. .
కరువు నేపథ్యంలో ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను వ్యవసాయ కమిషనరేట్ వ్యక్తిగత డిపాజిట్ ఖాతా(పీడీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం బదలాయించిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది బసంత్ కుమార్ వాదించారు. ఈ నిధులతో కరోనాకు సంబంధం లేదని బసంత్ వాదించారు. దీంతో జోక్యం ధర్మాసనం ఏ అవసరాల కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు ఉపయోగించాలో వాటికే వినియోగించాలని.. కరువు కోసం అని చెప్పి ఆ నిధులను వినియోగించడం సరికాదంది.
భవిష్యత్తులో అవసరమైతే ఉపయోగించుకోండి కానీ ఇప్పుడైతే నిధులను తిరిగి ఎస్‌డీఆర్ఎఫ్ లో జమ చేయాలని కోర్టు సూచించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో... ఉత్తర్వులు జారీ చేయకుండా తదుపరి విచారణను జూలై 13కి వాయిదా వేసింది.