దేశ రాజధానిలో ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటోన్న దోషి అక్షయ్ కుమార్ ఠాకూర్ దాఖలు చేసుకున్న క్యురేటివ్ పిటీషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది. ఇదే కేసులో సుప్రీంకోర్టుకు అందిన మూడో క్యురేటివ్ పిటీషన్ ఇది. ఇదివరకు వినయ్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ సింగ్ వేర్వేరుగా ఈ క్యురేటివ్ పిటీషన్ల ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఏకంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేయగా.. దాన్ని కొట్టివేసింది ధర్మాసనం. తాజాగా- అక్షయ్ కుమార్ ఠాకూర్ పిటీషన్ మరో పిటిషన్ దాఖలు చేసారు.
ఉరిశిక్షను అమలు చేయడానికి ఉద్దేశించిన డెత్ వారెంట్‌ను జారీ చేసిన తరువాత ఈ పరిణామాలన్నీ ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఉరిశిక్షను వాయిదా వేయించడానికే దోషులు ఇలా వరుసగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారంటూ ఇదివరకే నిర్భయ తల్లి ఆశాదేవి ధ్వజమెత్తారు. ఈ నెల 22వ తేదీ నాటికే అక్షయ్ కుమార్ ఠాకూర్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ సింగ్‌లకు ఉరిశిక్ష ను అమలు చేయాల్సి ఉండగా.. రాష్ట్రపతి కి క్షమాభిక్ష పిటీషన్ ను దాఖలు చేయడం తో కుదరలేదు.
దీనితో రెండోసారి డెత్ వారెంట్‌ను జారీ చేయాల్సి వచ్చింది. దీని ప్రకారం.. వచ్చే శనివారం తెల్లవారు జామున 6 గంటలకు నలుగురు కామాంధులను ఉరితీయబోతున్నారు. ఈ నేపథ్యంలో మరొకరు పిటిషన్ దాఖలు చేసారు. అయితే , ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జైల్లో పడిన బాధలు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయలేవు అని కోర్టు తేల్చిచెప్పింది. జైలులో పడిన కష్టాలు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయలేవంటూ జడ్జీలు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్న వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ పై న్యాయ సమీక్ష కు అవకాశం లేదని కోర్టు తేల్చి చెప్పింది..
ముకేశ్‌ను 8నెలలకు పైగా జైలులో ఉంచారన్న పిటిషనర్ తరపు లాయర్ వాదనలను కోర్టు అంగీకరించలేదు. రాష్ట్రపతి వేగంగా పిటిషన్‌ను తిరస్కరించారన్న ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. క్షమాభిక్ష పిటిషన్‌ను వేగంగా తిరస్కరించారన్న ముకేశ్ అభియోగాన్ని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తప్పు పట్టారు. క్షమాభిక్ష పిటిషన్ల పై నిర్ణయాల్లో ఆలస్యాన్ని విమర్శిస్తూ గతంలో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. క్షమాభిక్ష కేసుల్లో ఆలస్యం అమానవీయమైనదని అభిప్రాయ పడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం, హోం శాఖ ముకేశ్ తిరస్కరణకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ 4రోజుల్లో పూర్తి చేసినట్టు కోర్టు తెలిపింది.నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్యూరేటివ్ పిటిషన్ ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. వినయ్ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నారు.