ఏపీలో ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా వంద రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ.. విపక్ష నేత చంద్రబాబు ఇరిటేట్ అవుతున్న తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. సాధారణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడాది వరకూ ఏమీ మాట్లాడకుండా.. జరుగుతున్న పరిణామాల్ని చూస్తుండిపోతుంటారు. మరీ.. ముఖ్యమైన ఘటన ఏదైనా జరిగితే.. తమ వాదనను వినిపిస్తారు తప్పించి.. ఎక్కువగా జోక్యం చేసుకోరు. దీనికి కారణం లేకపోలేదు. ప్రజలు నచ్చి.. మెచ్చి పవర్ చేతికి వచ్చినప్పుడు.. వారి అభిప్రాయాల్ని గౌరవించాలన్న భావనతో పాటు.. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలన్నట్లు వ్యవహరిస్తుంటారు.
దీనికి భిన్నంగా బాబు పరిస్థితి ఉందని చెప్పాలి. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా వంద రోజులు కూడా కాలేదు. ఆయన అదే పనిగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వెళ్లటం.. అవసరం ఉన్నా లేకున్నా.. డైలీ బేసిస్ లో ఏదో ఒక అంశం మీద ఆగ్రహం వ్యక్తం చేయటం.. ప్రభుత్వాన్ని తిట్టేందుకు కొత్త కొత్త తిట్లను ప్రయోగిస్తున్నారు.
అంతేనా.. ఈ మధ్యన కాకినాడకు వెళ్లిన ఆయన.. అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ పార్టీ నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన వైనం తెలిసిన వారు విస్మయానికి గురయ్యారు. విపక్షంలో ఉన్నప్పుడు.. ఎన్నికలు గట్రా లాంటివి లేని వేళలో.. పార్టీ నేతల్ని ఇలా చిరాకు పుట్టించటం ఏమిటన్న విమర్శ వినిపించింది.
ఇప్పుడు అధికారపక్షాన్ని ఉద్దేశించి బాబు చేస్తున్న వ్యాఖ్యలు కూడా సరిగా లేవన్న మాట వినిపిస్తోంది. అధికార పక్ష నేతలతో పాటు పోలీసుల మీదా బాబు మండిపాటు అంతకంతకూ పెరుగుతోంది. తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని.. తమను వేధించటమే అధికారపక్షం పనిగా పెట్టుకుందంటూ ఆరోపణలు చేశారు.
తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్న ఆయన.. తాను అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మాదిరి వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవారంటూ వ్యాఖ్యలు చేశారు. అధికారం చేతిలో లేనప్పుడు ఇరిటేషన్ మామూలే. కానీ.. ఆ పేరుతో నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న విషయాన్ని బాబు లాంటోళ్లు మర్చిపోకూడదు. జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వంద రోజులు కాకుండానే ఇంతగా ఇరిటేట్ అయిపోతే.. మరో నాలుగున్నరేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా తాను వ్యవహరించాలన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు మర్చిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో మరెలా మారిపోతారో అన్న ఊహ కూడా భయపెట్టేలా ఉందన్న మాట తెలుగు తమ్ముళ్ల నోటి ఆఫ్ ద రికార్డుగా రావటం గమనార్హం.