దేశ ఆర్థిక రాజధానికి ఆ రాష్ట్రం ఆలవాలం.. ముంబై లాంటి పెద్ద పెద్దనగరాలు కలిగి ఉన్న మహారాష్ట్రలో రాజకీయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోటాపోటీగా.. ఒకరిని మించిన మరొకరు రాజకీయ రంగంలో ఆరితేరిన వారు ప్రస్తుతం ఆయా పార్టీల తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హిందుత్వ భావాజాలు.. సిద్ధాంతాలు కలిగిన బీజేపీ, శివసేనలు ఇక్కడ ప్రధానంగా పాగా వేశారు. వారి మధ్య ఎప్పుడు వివాదాలు జరిగినట్లే జరిగి మళ్లీ కలిసి ఎన్నికల పోరులు ఉండే సరికి కలిసిపోయి లోక్ సభ సీట్లను కొల్లగొడుతాయి. గత ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్, ఎన్సీపీలకు సీట్లు దక్కకుండా చేశాయి. ఈసారి ఎన్నికల్లోనూ బీజేపీ, శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి బరిలో నిల్చున్నాయి.
దేశంలో అత్యధిక లోక్ సభ స్థానాలున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. విదర్భ, కొంకణ్, మరట్వాడా ప్రాంతాలు కలిగి ఉన్న రాష్ట్రంలో మొత్తం 48 లోక్ సభ స్థానాలున్నాయి. 11.23 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో 8.73 కోట్ల మంది ఓటర్లున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ 23, శివసేన 18, కాంగ్రెస్ 2, ఎన్సీపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ 25, శివసేన 23, కాంగ్రెస్ 26, ఎన్సీపీ 22 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈనెల 11 ఎన్నికలు జరగగా, 18,23,29 తేదీల్లో మరో మూడు విడుతల్లో మరో పోలింగ్ లు జరుగనున్నాయి..
గత ఎన్నికల్లో కంటే ఈసారి బీజేపీకి చేదు అనుభవం ఎదురు కానుందని కొందరు లెక్కలు వేసీ మరీ చెబుతున్నారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను చూస్తున్న ఫడ్నవీస్ ప్రభుత్వం తాగునీటి సమస్యకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రుణమాఫీ పథకం అమలు చేయాలని లక్షలాది మంది రైతులు రోడ్డెక్కి నిరసన చేయడం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపున్నాయి. మరోవైపు బీమా-కోరేగావ్ అల్లర్లు, అన్నదాత ఆత్మహత్యలు ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.
ఇక బీజేపీ, శివసేనలు పైకి కలిసున్నట్లు కనిపిస్తున్నా అప్పుడప్పుడు సూటి పోటి మాటలతో ఒకరినొకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకదశలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరక వేర్వేరుగా పోటీలో ఉంటాయని ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కలుగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఇక కాంగ్రెస్, ఎన్సీపీల పరిస్థితి అంతంత మాత్రంగానేగా ఉంది. రైతుల ఆందోళనలతో వారికి వెన్నుదన్నుగా ఇక్కడి పార్టీ నాయకులు నిలిచారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహన్ అన్నదాతలకు మద్దతు పలుకుతూ తాము అధికారంలోకి వస్తే సమస్య పరిష్కరిస్తామని హామినిస్తున్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ కు పెట్టని కోట అయిన మహారాష్ట్ర రానురాను బీజేపీ చేతిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం మోడీ హవా వీస్తున్న తరుణంలో కాంగ్రెస్ కు అన్నదాతలే ఆయుధంగా నిలిచారు. వ్యవసాయ సంక్షేభం, మరాఠా రిజర్వేషన్ల పర్వాన్ని కాంగ్రెస్ నాయకులు లేవనెత్తుతున్నారు. ఇక ఎన్సీపీ అధినేత పవార్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన స్థానం బరామతి నియోజకవర్గం నుంచి కూతురు సుప్రియా సూలేను బరిలోకి దించారు. మరో స్థానంలో సమీప బంధువు పార్థ్‌పవార్‌ను పోటికి నిలబెట్టారు. ఈ పరిస్థితిల్లో మహారాష్ట్ర ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి మరి..