లాక్ డౌన్ ఎత్తేసేందుకు ఆ మూడు కీలకం-ఐసీఎంఆర్ !

Update: 2021-06-02 12:34 GMT
మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ జోరు కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు , వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో చాలా రాష్ట్రాలు కరోనా మహమ్మారి కట్టడి కోసం లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చాయి. అయితే , ఆ తర్వాత పటిష్టమైన లాక్ డౌన్ అమలు చేయడంతో .. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. లాక్‌ డౌన్ అమ‌లు చేస్తున్న రాష్ట్రాల్లో కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న స‌మ‌యంలో లాక్‌ డౌన్ ను ఎత్తివేయాల‌ని రాష్ట్రాలు చూస్తున్నాయి.  క‌రోనా లాక్‌డౌన్‌ ఎత్తివేత‌పై ఐసీఎంఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  దీనికోసం మూడు అంశాల ప్ర‌ణాళిక‌ను వెల్ల‌డించింది.

పాజిటివిటీ రేటు వారానికి 5 శాతం కన్నా తక్కువగా ఉండటం,కోవిడ్ బారినపడే రిస్క్ ఎక్కువగా ఉన్నవారిలో 70శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడం,లాక్ డౌన్ తర్వాత కూడా ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించడం... మూడింటి ఆధారంగా లాక్ డౌన్‌ ను క్రమంగా ఎత్తివేయాలన్నారు. దేశంలో పలు రాష్ట్రాలు అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో భార్గవ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 27.8లక్షల మందికి కోవిడ్ టీకాలు వేశారు. ఇప్పటివరకూ మొత్తంగా 23 కోట్ల డోసులు సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వ స్పష్టం చేసింది. ఇందులో ఇప్పటివరకూ 21,51,48,659 డోసులు పంపిణీ చేయగా..ప్రస్తుతం మరో 1.57 కోట్ల డోసులు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి . కేంద్ర ఆరోగ్య శాఖ బ్లూ ప్రింట్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలిపింది.
Tags:    

Similar News