నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు.. నల్లధనాన్ని వెలికి తీసేందుకు వీలుగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా అప్పట్లో మోడీ సర్కారు చెప్పుకుంది. అప్పుడున్న పెద్దనోట్లను రద్దు చేసిన మోడీ సర్కారు వాటి స్థానంలో రూ.2వేలు.. రూ.500 నోట్లను కొత్తగా తీసుకురావటం తెలిసిందే. మరి.. నకిలీల బెడద తగ్గిందా? అంటే.. లేదనే చెప్పాలి. నకిలీ నోట్ల బెడద అన్నంతనే అత్యధిక విలువ ఉన్న రూ.2వేల నోటు అగ్రస్థానంలో ఉంటుందని అనుకోవచ్చు.
కానీ.. అది తప్పని చెప్పింది ఆర్ బీఐ నివేదిక. దేశంలో రూ.2వేల నోట్ల కంటే అత్యధికంగా నకిలీలు ఉన్న నోటుగా రూ.500 నోటు అవతరించింది. అదే సమయంలో రూ.500 తర్వాత విలువ ఉన్న నోటు రూ.200 కాగా.. దాని కంటే ఎక్కువగా రూ.100నోటు నకిలీలు ఎక్కువన్న విషయాన్ని రిజర్వు బ్యాంక్ తాజా నివేదికలో స్పష్టం చేసింది. తాజాగా రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకున్న రూ.2వేల నోట్ నకిలీల విషయంలో ఐదో స్థానంలో ఉండటం గమనార్హం. గడిచిన కొన్నేళ్లుగా రూ.2వేల నోటును రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. నకిలీ బెడద ఆ నోటుకు తక్కువగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నకిలీ నోట్లపై జాతీయ బ్యాంకులు.. ఇతర ఆర్థిక సంస్థలు గుర్తించే అంశాల ఆధారంగా నకిలీ నోట్ల మీద నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది. జాతీయ బ్యాంకులు.. ఇతర బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు తాము గుర్తించిన నకిలీ నోట్లను ఆర్ బీఐకు పంపిస్తాయి. నోట్లకు సంబంధించిన వివరాలతో పాటు నకిలీ నోట్లకు సంబంధించిన అంశాలపై ఆర్ బీఐ విడుదల చేసిన తాజా నివేదికలోని కీలక అంశాల్ని చూస్తే..
- 2022-23లో కరెన్సీ నోట్ల ముద్ర కోణం ఆర్ బీఐ రూ.4,682.80 కోట్లను వెచ్చించింది.
- దేశ వ్యాప్తంగా 2022-23లో మొత్తం 2,25,769 నకిలీ నోట్లను గుర్తిస్తే వాటిల్లో 4.6 శాతం నోట్లను ఆర్ బీఐ నేరుగా గుర్తించింది. 95.4 శాతం నోట్లను వివిధ బ్యాంకులు గుర్తించాయి.
- 2021-22తో పోలిస్తే 2022-23లో నకిలీ నోట్ల తగ్గాయి. 2021-22లో 2.30లక్షల నకిలీ నోట్లను గుర్తిస్తే 2022-23లో 91వేలు మాత్రమే గుర్తించారు.
- నకిలీ నోట్లలో రూ.500 నోటు మొదటి స్థానంలో, రూ.వంద నోటు రెండో స్థానంలో నిలిచాయి. మూడో స్థానంలో రూ.200 నోటు.. నాలుగో స్థానంలో రూ.50 నోట్లు ఉన్నాయి. రూ.2వేల నోటు ఐదో స్థానంలో ఉండటం గమనార్హం.