కరోనా పుట్టిన వూహాన్ పరిస్థితి చూస్తారా?

Update: 2020-08-18 00:30 GMT
కరోనాను పుట్టించి ప్రపంచం మీదకు వదిలిన చైనాలోని వూహాన్ వాసుల ప్రస్తుత పరిస్థితి చూస్తే మీరంతా ముక్కున వేలేసుకుంటారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ముఖానికి మాస్కులు, చేతికి శానిటైజర్లు రాసుకుంటుంటే వీరు మాత్రం వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి..

తాజాగా చైనాలోని వూహాన్ నగరంలో వాటార్ పార్క్ లో వేలాది మంది ముఖాలకు ఎలాంటి మాస్కులు గానీ.. చేతులకు గ్లోవ్స్ కానీ లేకుండా జలకాలాటలు ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కరోనా వైరస్ పుట్టిన వూహాన్ లో మొదట 76 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. అనంతరం గత జూన్ లో పరిస్థితులు కుదుట పడడంతో సడలించారు. తాజాగా వాటర్ పార్క్ ను ప్రభుత్వం ప్రారంభించింది. 400 టూరిస్ట్ ప్రాంతాల్లో ప్రజలను ఉచితంగా అనుమతించింది. దీంతో ప్రజలు పోటెత్తి ఎంజాయ్ చేశారు.

కరోనా వైరస్ కేసులను చైనా ప్రభుత్వం గట్టిగా నియంత్రించింది. ఇప్పుడక్కడ కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రజలు అన్నీ మరిచిపోయి ఎంజాయ్ చేస్తున్నారు.
Tags:    

Similar News