టెక్సాస్ లో ముగ్గురు ఇండియన్ల పరిస్థితి విషమం -ప్లాస్మా దాతల కోసం అభ్యర్థన
కరోనా మహమ్మారి అగ్రదేశం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. శుక్రవారం నాటికి ఇక్కడ 2.60 లక్షల కేసులు నమోదు కాగా - ఆరున్నర వేలమంది మృత్యువాత పడ్డారు. అగ్రదేశంలోని న్యూయార్క్ పైనే భారీ ప్రభావం పడింది. న్యూజెర్సీ - కాలిఫోర్నియా - మిచిగాన్ - ఫ్లోరిడా - లూసియానా - రాష్ట్రాలపై కూడా పెను ప్రభావమే పడింది. అనేక రాష్ట్రాల గవర్నర్లు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించారు. సామాజిక దూరాన్ని అమలు చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఆలస్యమైనట్లుగా కనిపిస్తోంది.
అమెరికాలోని ఇండియన్లు భయాందోళనకు గురవుతున్నారు. టెక్సాస్ హ్యూస్టన్ లో ముగ్గురు భారతీయులకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. తమ వారికి కరోనా సోకడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే రోగులను కాపాడేందుకు ప్లాస్మా డోనర్స్ అవసరం. కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వారిలో ఐటీ ఉద్యోగి రోహన్ బవదేకర్ - డాక్టర్ లవంగ వేలుస్వామి ఉన్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
హ్యూస్టన్‌కు చెందిన రోహన్ బవదేకర్ పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. అతని ద్వారా భార్యా - పిల్లలకు కూడా వచ్చింది. దీంతో వారిని సెల్ఫ్ ఐజోలేషన్ లో ఉంచారు. రోహన్ భార్య ప్లాస్మా దాతల కోసం అభ్యర్థిస్తున్నారు. మరో పేషెంట్ వేలుస్వామి భార్య కూడా A లేదా AB బ్లడ్ గ్రూప్ బ్లడ్ - ప్లాస్మా డొనేషన్ కోసం అభ్యర్థిస్తున్నారు.