సీతయ్య ఎవడి మాట వినడు. ఒక సీతయ్య ఉంటేనే చుక్కలు కనిపిస్తాయి. అలాంటిది ముగ్గురు సీతయ్యలు.. అది కూడా పాలకులుగా మారితే ప్రజలకు ఎన్ని తిప్పలో తెలుగు ప్రజల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఆ ముగ్గురు సీతయ్యలు ఎవరో కాదు.. ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండోవారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మూడో సీతయ్య ప్రధాని మోడీ.
విలయతాండవం చేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవాలి. కరోనా కేసులు భారీగా పెరిగిపోయిన తర్వాత కళ్లు తెరిచిన కేసీఆర్.. హడావుడి నిర్ణయాల్ని ప్రకటించారు. గడిచిన మూడు రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనది కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తానన్న ప్రకటన మాత్రమే అది కూడా.. వ్యూహాత్మకంగా చేసిన ప్రకటనగానే చెప్పాలి. తెలంగాణలో బీజేపీ దూకుడు బ్రేకులు వేయటంతో పాటు.. మోడీ మీద ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవటం కోసం ప్రజల ప్రాణాల కంటే పైసలు ముఖ్యం కాదన్న వ్యాఖ్య ఆయననోటి నుంచి వచ్చింది.
ఒకవేళ కేసీఆర్ కమిట్ మెంట్ ఇంతలా ఉంటే.. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీతో పాటు.. కరోనా వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయాల్సిన బిల్లులపై నియంత్రణ పెట్టే అవకాశాన్ని ఆయన ఎందుకు వినియోగించటం లేదు? దోపిడీకి పాల్పడుతున్న ఆసుపత్రుల్ని ప్రభుత్వం కొరడా ఎందుకు విదల్చటం లేదన్నది ప్రశ్న. అన్నింటికి మించి.. కరోనా జోరును తగ్గించే.. కట్టడి ప్రాంతాల ఏర్పాటు మమ అనేలా ఏర్పాటు చేయటమే తప్పించి.. అందులో సీరియస్ నెస్ కనిపించదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఇప్పటికే విపక్షాలతో పాటు.. వివిధ సంఘాల వారు ఎన్నికల్ని వ్యతిరేకిస్తున్నారు. వారే కాదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ముఖ్యమా అన్న ప్రజల మాటను పట్టించుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే.. కరోనా విషయంలో ఆయన ఇప్పటికే ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. దీర్ఘకాలం సహజీవనం చేయాలని డిసైడ్ అయిన ఆయన.. మొదటి వేవ్ లో సహాయ కార్యక్రమాల్ని ముమ్మరంగా చేపట్టిన ఆయన రెండో వేవ్ లో ప్రభుత్వ తీరు బాగోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున కేసులు రోజువారీగా నమోదవుతున్నా.. ఆయన ప్రభుత్వం పలువురు విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తున్న తీరు సంచలనంగా మారింది. విపత్తు వేళ.. మిగిలిన విషయాల్ని వదిలేసి.. సంక్షోభ నివారణ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా.. ఎవరేం అనుకున్నా తాను అనుకున్నది అనుకున్నట్లు జరగాలన్న పంతంతో ఆయన ఉన్నారు. అంతేకాదు.. జాతీయ స్థాయితో పాటు.. పలు రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినా.. జగన్ సర్కారు మాత్రం పిల్లలు పరీక్షలు రాయాలన్న పంతంతో ఉన్నారు. ఎందుకంత మొండితనం అన్నది ప్రశ్న.
ప్రధాని మోడీ మరో రకం సీతయ్య. బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆయన పంతం నెరవేర్చుకోవటానికి దేశ ప్రయోజనాల్ని.. దేశ ప్రజల్ని గాలికి వదిలేశారన్న విమర్శ పెద్ద ఎత్తున ఉంది. ఎంతసేపటికి తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్పించి.. మిగిలిన రాష్ట్రాల గురించి పట్టని వైనం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎవరేం చెప్పినా వినేందుకు.. దాన్ని ఆచరించేందుకు ఆయన సిద్ధంగా ఉండరన్న మాట ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తోంది. ఆయన ప్రభుత్వం అనుసరించిన వ్యాక్సిన్ పాలసీ తీవ్ర విమర్శలకు దారి తీసింది. సమర్ధుడైన నాయకుడన్న మాట స్థానే.. విపరీతమైన మొండితనం ఆయన సొంతమన్న మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఇలా ఈ ముగ్గురు సీతయ్యలతో.. తెలుగు ప్రజలు నిత్యం ఏదోలా తిప్పలు పడుతున్న పరిస్థితి.