దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలు, కొన్నివర్గాల నిరసనల నేపథ్యంలో పలు చోట్ల కేంద్రమంత్రులకు ఘాటు నిరసనలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇదే రీతిలో ఒడిశాలోని కేంద్రపరలో పర్యటించిన సందర్భంగా కేంద్ర గిరిజనశాఖ మంత్రి జువల్ ఓరమ్‌పై బిజా జనతాదళ్ కార్యకర్తలు బుధవారం కోడిగుడ్లతో దాడి చేశారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించారు. మహానది వివాదం - మధ్యప్రదేశ్ లోని మంద్ సౌర్ లో రైతులపై పోలీసు కాల్పులకు వారి ఇలా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో ఆసక్తికరమైన రిప్లై ఇచ్చారు.
కేంద్రమంత్రులకు ఎదురవుతున్న నిరసనలు, కోడిగుడ్లు విసురుతున్న ఉదంతాల గురించి కొందరు విలేకరులు బాబుల్ సుప్రియో వద్ద ప్రస్తావించగా... నామీద ఎవరైనా గుడ్లు విసిరేస్తే, వాటితో ఆమ్లెట్ వేసుకొని తింటా అని కేంద్రమంత్రి ఆశ్చర్యకరమైన రిప్లై ఇచ్చారు.``నాకేం భయం లేదు. నేను మాంసాహారిని. నామీద గుడ్లేస్తే వాటిని తినేస్తా. అంతే `` అని బాబుల్ అన్నారు. ``నేను పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చాను. ఒడిశాలో కంటే రాజకీయ పరిస్థితులు అక్కడ ఇంకా దారుణంగా ఉంటాయి. కాబట్టి అటువంటి దాడులను లెక్కచేయను`` అని కేంద్ర మంత్రి అన్నారు. ఒడిశాను బిజా జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలు దోచుకొంటున్నాయని ఆయన ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/