మహాకూటమిలో రోజుకో బాంబు పేలుతోంది. కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత ఈ బాంబు దాడులు ప్రతిరోజు పెరుగుతున్నాయి.వీటికి అడ్డుకట్ట వేయాలని ఇరు పార్టీల అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయే కాని వాటికి ఎక్కడా ఫుల్ స్టాప్ పడడం లేదు.తాజాగా కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలకు చెందిన అగ్ర నాయకులు టిక్కట్లను అమ్ముకుంటన్నారంటూ ఇరు పార్టీలకు చెందని ఆశావహులు రోడ్డెక్కుతున్నారు. నిజానికి ప్రతి ఎన్నికల్లోనూ అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి ఆరోపణలు, వివాదలు రావడం సహజమే. అయినా ఈ సారి మాత్రం తెలంగాణ మహాకూటమిలో ఈ ఆరోపణల పర్వం నానాటికి పెరుగుతోంది. దీనికి కారణం గతంలో ఆరోపణలు చేసినట్లుగా కాకుండా ఈ సారి అందరూ రుజువులతోనూ - వీడియో టేపులతోనూ ముందుకు రావడంతో ఇరు పార్టీల నాయకుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. మహాకూటమిలో పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ బేరాల వివాదం ఎక్కువగా పీడిస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా - పార్టీ స్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ లపైనే ఆశావహులు నేరుగా ఆరోపణలు సంధిస్తున్నారు.
ఎన్నికల సమయంలో టిక్కట్ల పంపిణీని ఢిల్లీలో కాకుండా ఎన్నికలు జరుగుతున్న ఆయా రాష్ట్రాల్లోనే చేపట్టాలని అధిష్టానం నిర్ణయించింది. ఇదే ఇప్పుడు వారి పాలిట ఇబ్బందులకు కారణమవుతోంది. తెలంగాణకు భక్త చరణ్ దాస్ ను బాధ్యుడిగా నియమించారు. ఆయనకే టిక్కట్ల కోసం కోట్లాది రూపాయలు ముడుపులుగా ఇచ్చామని ఆశావహులు కొందరు మీడియా ముందు చెబుతున్నారు. దీనికి ఆయన సమాధానం చెప్పినా ముడుపుల వివాదం మాత్రం సమసిపోవడం లేదు. ముడుపులు ఇచ్చామని చెబుతున్న వారిలో శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ - మేడ్చల్ టిక్కట్ ఆశించిన జంగయ్య యాదవ్ వంటి వారు ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీలోనూ టిక్కట్ల అమ్మకాల జోరందుకున్నాయి. రాజేంద్రనగర్ నుంచి కాంగ్రెస్ నుంచి బరిలో దిగాలనుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ స్ధానాన్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. ఎల్బీనగర్ టిక్కట్ ఆశిస్తున్న సామ రంగారెడ్డి కూడా తన నుంచి ఇద్దరు తెలుగుదేశం నాయకులు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపించారు. మొత్తానికి టిక్కట్ల రచ్చ మహాకూటమిని రోడ్డున పడేయడం ఖాయమంటున్నారు పరిశీలకులు.