దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకొన్న ఉదంతంలో ఎన్సీబీకి చెందిన కీలక అధికారి సమీర్ వాంఖడే కీ రోల్ ప్లే చేయటం తెలిసిందే.తనకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా గోవాకు వెళుతున్న క్రూయిజ్ ను పట్టుకొని.. అందులోని 1800 మందిలో నుంచి షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు.. మరికొందరు హైప్రొఫైల్ పిల్లల్ని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఈ ఉదంతంలో సమీర్ కీలకంగా వ్యవహరించారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న ఆయనకు తరచూ తన తల్లి సమాదిని చూసుకోవటం కోసం వెళుతుంటారు. ఆ సందర్భంగా ఆయన్ను పోలీసు అధికారుల పేరుతో కొందరు వెంబడిస్తున్న వేళ.. ఆయన భద్రతపై కొత్త సందేహాలు వ్యక్తమయ్యాయి.
దీంతో తన భద్రత మీద అనుమానాల్ని వ్యక్తం చేస్తూ సమీర్ వాంఖడే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన వారు.. ఆయనకు ప్రస్తుతం ఉన్న సెక్యురిటీని మరింతగా పెంచారు. ప్రస్తుతం ఉన్న అంగరక్షకులతో పాటు సాయుదజవాన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసు బయట కూడా పోలీసుల పహరాను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు టైట్ సెక్యురిటీని ఏర్పాటు చేశారు. ఈ మధ్యనే ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెబుతూ.. వాంఖడేకు చెందిన సీసీ ఫుటేజ్ కోసం ఆరా తీసిన వైనం కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు భద్రతను మరింతగా పెంచుతూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.