చైనాలో టిక్ టాక్‌ కు భారీ దెబ్బ‌!

Update: 2020-02-07 03:30 GMT
టిక్ టాక్....క‌రోనా....చైనాలో పుట్టిన ఈ రెండింటికి చాలా పోలిక‌లున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ రెండు ప‌దాలు అతి త‌క్కువ స‌మ‌యంలో పాపుల‌ర్ అయ్యాయి. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోంటే....కొద్ది సంవ‌త్స‌రాలుగా టిక్ టాక్ యాప్ ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌ను ఉర్రూత‌లూగిస్తోంది. కంటికి కనిపించని సూక్ష్మజీవి క‌రోనా దెబ్బ‌కు చైనాతో పాటు ప‌లుదేశాలు విల‌విల‌లాడుతోంటే...టిక్ టాక్ దెబ్బ‌కు ప‌లు సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్‌ లు - యాప్‌ లు గ‌డ‌గ‌డ‌లాడాయి.  క‌రోనా దెబ్బ‌కు 13.6 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో కళకళలాడిన చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల‌వ‌గా...టిక్ టాక్ దెబ్బ‌కు ప‌లు యాప్‌ లు చాప చుట్టేశాయి. అయితే, అనూహ్యంగా చైనాలో పుట్టిన ఈ క‌రోనా వైర‌స్....చైనాలోనే పుట్టిన టిక్ టాక్‌ కు భారీ న‌ష్టం క‌లిగించ‌డంతో చైనీయులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

టిక్ టాక్ పుట్టిన చైనాలోనే పుట్టిన‌ క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. క‌రోనా దెబ్బ‌కు చైనాలో టిక్ టాక్ యాప్ ప‌డిపోయింది.  మిగ‌తా యాప్‌ ల‌పై వైర‌స్‌ లా దాడి చేసిన టిక్ టాక్‌ పై తాజాగా క‌రోనా వైర‌స్ ఎటాక్ చేసింద‌ట‌. క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు చైనాలో టిక్‌ టాక్ క్రేజ్ విప‌రీతంగా త‌గ్గిపోవ‌డంతో టిక్ టాక్ వ‌ల్ల వ‌చ్చే ఆదాయం ఒక్క‌సారిగా త‌గ్గిపోయింద‌ట‌. కరోనా కోర‌ల్లో చిక్కుకున్న చైనా యూజ‌ర్లు....టిక్ టాక్‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని టాక్. ఇక‌, టిక్ టాక్‌ లో క‌రోనాపై - చైనీయుల ఆహార‌పు అల‌వాట్ల‌పై ప‌లు దేశాల వారు సెటైరిక‌ల్‌ గా  చేస్తున్న మెమేలు - వీడియోలు కూడా చైనాలో టిక్ టాక్ క్రేజ్ త‌గ్గ‌డానికి మ‌రో కార‌ణ‌మ‌ట‌. ఏది ఏమైనా....త‌న వేలితో త‌న కంటిని పొడుచుకున్న చందంగా....చైనాలో టిక్ టాక్‌కు క‌రోనా చెక్ పెట్ట‌డం చైనీయుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంద‌ట‌.
Tags:    

Similar News