ఎక్కడైనా.. ఏరాష్ట్రమైనా.. చట్టాన్ని గౌరవిస్తామని.. చట్ట ప్రకారం వ్యవహరిస్తామని.. చెబుతుంటాయి. ఎంతటి నేరం చేసిన వారినైనా.. చట్ట ప్రకారమే శిక్షిస్తామని.. చెబుతాయి. అయితే.. దీనికి విరుద్ధంగా కర్ణాటక మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో హత్యలు చేసేవారిని భయపెట్టేలా వ్యవహరిస్తామన్నారు. వారిని ఎన్ కౌంటర్ చేసేందుకు ప్రభుత్వం వెనుకాడ బోదన్నారు. ఎన్కౌంటర్లకు సమయం వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ఐటీ శాఖ మంత్రి సీ అశ్వథ్నారాయణ్.
హత్యలకు పాల్పడే వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర యువమోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్యపై మంత్రి స్పందించారు. ఎన్కౌంటర్లకు సమయం వచ్చిందన్నారు.
రాబోయే రోజుల్లో ఇలాంటి హత్యలు జరగకుండా చూస్తామని చెప్పారు. హత్యలకు పాల్పడే వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్ కౌంటర్లు కొత్తకాదని.. అయితే.. కొన్నాళ్లుగా ఆపామని.. ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.
వాస్తవానికి.. ఎన్ కౌంటర్లు అనేవి.. పోలీసులకు విధిలేని పరిస్థితిలో.. వారి ఆత్మరక్షణ కోసం.. చేసేవిగా చట్టం పేర్కొంటోంది. అంతే తప్ప.. ఉద్దేశ పూర్వకంగా.. ఎవరినీ కాల్చి చంపడాన్ని..చట్టం ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వాలేదు. కానీ, మంత్రి చేసిన వ్యాఖ్యలు..ఉద్దేశ పూర్వకంగానే.. చేస్తున్నట్టుగా ఉన్నాయని అంటున్నారు విపక్ష నాయకులు. రాష్ట్ర ప్రభుత్వమే.. హత్యలను ప్రోత్సహిస్తోందని.. కాంగ్రెస్ నాయకులు.. అప్పుడే విమర్శలు గుప్పించారు.
మరోవైపు గురువారం హత్యకు గురైన మహ్మద్ ఫాజిల్ అంత్యక్రియలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫాజిల్ అంత్యక్రియల నేపథ్యంలో.. ఉద్రిక్తతలు తలెత్తకుండా మంగళూరు నగర శివార్లలో ఉన్న సూరత్కల్ ప్రాంతంలో జులై 30 వరకు 144 సెక్షన్ను అమలు చేస్తునట్లు పోలీసులు ప్రకటించారు. సూరత్కల్, ముల్కీ, బజ్పే, పణంబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.