గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు ఊహించని రీతిలో సాగుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ప్రయత్నించి భంగపడిన టీటీడీపీ నేతల అసంతృప్తిజ్వాలల తీవ్రత తీవ్రరూపు దాల్చింది. అధినేతల పట్ల భయం.. భక్తిని ప్రదర్శించే తమ్ముళ్లు కట్టు దాటేశారు. తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
నిత్యం ఎవరినైతే జై.. జైలు కొడతారో వారి మీద విరుచుకుపడటంతో పాటు.. వారి ఫ్లెక్సీల్ని చించేయటం గమనార్హం. టీఎన్ ఎస్ ఎఫ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన నిరసన తీవ్రరూపం దాల్చింది. మరోవైపు టిక్కెట్ల వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన మరికొందరు నేతలు సైతం నిరసన బాట పట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తమ నిరసన వ్యక్తం చేసే క్రమంలో లోకేశ్ ఫ్లెక్సీని చించేసేందుకు సైతం వెనుకాడలేదు. ప్రత్యర్థి రాజకీయ నేతలు తమ నిరసనలో మాత్రమే చోటు చేసుకునే ఘటనలు.. టిక్కెట్లు రాని కారణంగా తమ్ముళ్లు తీవ్రస్థాయిలో మండిపడుతూ.. పార్టీకి దిశానిర్దేశం చేసే లోకేశ్ ఫ్లెక్సీని చించివేయటం విస్మయంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో లోకేశ్ ఫ్లెక్సీ చించివేతకుకారణమైన శ్రీకాంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలోనే పార్టీ కీలక నేత ఫ్లెక్సీని చించివేసే వరకూ వెళ్లిన ఘటనను చూస్తే.. తమ్ముళ్లు ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.