మోడీతో ఉండాలా వ‌ద్దా.. జ‌గ‌న్ అనూహ్య నిర్ణ‌యం.. అప్పుడేనా..!

Update: 2023-01-20 10:30 GMT
ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుతో అంత‌ర్గ‌త మైత్రిని సాగిస్తు న్నారు ఏపీ సీఎం జ‌గ‌న్‌.ఆయ‌న ఒక సంద‌ర్భంలో ఈ విష‌యాన్ని చెప్పుకొచ్చారు. కేంద్రంతో ఒక ప‌విత్ర మైన స్నేహాన్ని కొన‌సాగిస్తున్నామ‌ని..కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అది కూడా ఏపీ ప్ర‌జ‌ల కోసం.. రాష్ట్రం కోస‌మేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అయితే..ఈ  బంధం ఎన్నాళ్లు ఉంటుంది?  అనేది ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. కేంద్రంలో తేడా వ‌స్తే.. ఏ పార్టీ కూడా మోడీ వెంట ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌దు. దీనికి జ‌గ‌న్ కూడా అతీత‌మేమీ కాదు.. సో.. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలైనా.. ఉండొచ్చు.

అయితే.. ఇప్పుడు దీనికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. ఎందుకంటే..ఒక‌వైపు త‌న‌తో క‌లిసి రావాల‌ని.. రెండు రాష్ట్రాల స‌మ‌స్య‌ల‌ను క‌లిసి కూర్చుని చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకుందామ‌ని.. తెలంగాణ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నుంచి సీఎం జ‌గ‌న్‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

ఇది ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. ఒక్క ప్ర‌చార‌మే కాదు. నిజం కూడా. ఎందుకంటే.. జ‌గ‌న్‌ను అభిమానిం చే మంత్రులు తెలంగాణ‌లో ఉన్నారు. ఇక‌, జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుం డా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై నిశితంగా దృష్టి పెట్టారు. కేంద్రంలోమోడీ హ‌వాత‌గ్గి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న క‌నుక ప‌ల‌చ‌న అవుతున్నార‌ని తెలిసిన మ‌రుక్ష‌ణంజ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

అయితే.. ఇది ఎలా తెలుస్తుంది? అంటే.. తాజాగా దీనికి కూడా ముహూర్తం ఫిక్స‌యిపోయింది. ప్ర‌స్తుతం మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రంగంరెడీ అయింది. త్రిపుర‌, మేఘాల‌య‌, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు ఉన్నాయి.

మార్చి 2న ఫ‌లితం రానుంది. ఇక‌, ఆ వెంట‌నే.. లేదా ఈ లోగానే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లకు కూడా రంగం సిద్ధం కానుంది. దీని ఫ‌లితాలు మేలో వ‌చ్చేస్తాయి. దీంతోమోడీ హ‌వా ఉందా?  లేదా? అనేది అప్పుడు తేలిపోతుంది. దీనిని గ‌మ‌నించిన త‌ర్వాత‌.. ఆవెంట‌నే జ‌గ‌న్ నిర్న‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News