రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఉప్పు-నిప్పులు కలిసిపోయినా.. ఆశ్చర్యపో వాల్సి న అవసరం లేదు. ఎందుకంటే..ప్రస్తుతం ఉన్న రాజకీయాలు పదవుల కోసమే కాబట్టి. రాష్ట్రంలో నువ్వెం తంటే నువ్వెంతంటూ.. అధికార వైసీపీ-ప్రతిపక్షం టీడీపీలు భారీ ఎత్తున పోరాడుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి పార్టీలు.. ఎక్కడైనా సర్దుకుపోతాయా? నువ్వాపదవి తీసుకో.. నేనీ పదవి తీసుకుంటా.. అంటూ.. పోటీ లేకుండా పంచుకుంటాయా?
అసలు ఇది ఆలోచనకు కూడా అందని విషయం. పైగా టీడీపీ-వైసీపీ బలాలు సమవుజ్జీగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ-టీడీపీలు చేతులు కలుపుతాయని ఎవరైనా అనుకున్నారా? ఎట్టి పరిస్థితులోనూ అనుకుని ఉండరు. కానీ,.. చేతులుకలుపుకొన్నారు. కాకినాడ పంచాయితీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీలు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవుల కోసం చేతులు కలిపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.
కాకినాడ పంచాయతీలోని తాళ్ళ రేవు మండలం లచ్చి పాలెం పంచాయతీ సర్పంచ్ గా వైసీపీ మద్దతుతో టీడీపీ నాయకురాలు.. అనిశెట్టి సీతారత్నం ఏకగ్రీవం అయ్యారు. దీనిని ఎన్నికల కమినర్ ప్రకటించాల్సి ఉంది. ఇక, వైసీపీ అభ్యర్థి గుత్తుల నూకరాజుకు ఊర సర్పంచ్ పదవి ఇచ్చేందుకు(ఎన్నుకునేందుకు) టీడీపీ స్థానిక నేతలు మద్దతు తెలిపారు. దీనికి గ్రామస్తులు సైతం పచ్చజెండా ఊపారు. దీంతో ఎక్కడా పోటీ లేకుండా.. వివాదం.. విభేదాలు కూడా లేకుండా.. వైసీపీ-టీడీపీలు చెరొకటి పంచుకోవడం గమనార్హం.
కాగా, కాకినాడ రెవిన్యూ డివిజన్ పరిదిలో సర్పంచ్ పదవులకు మొత్తం 1102 నామినేష్లు వచ్చాయి. మొత్తం సర్పంచ్ పదవులు 366. ఇక వార్డుల విషయానికి వస్తే రెండు రోజుల్లో మొత్తం 5326 నామినేషన్లు దాఖలు అయ్యాయి.. మరో వైపున నామినేషన్ల పర్వం ఊపందుకోవంతో ఎన్నికల సందడి కూడ కనిపిస్తోంది. అయితే.. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే.. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జోరు, మరికొన్ని చోట్ల టీడీపీ జోరుకొనసాగుతుండడం గమనార్హం.