ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ లో ఉత్తర పనితీరు కనబరుస్తున్న మంత్రుల జాబితా వచ్చేసింది. ఉత్తర పనితీరులో మోదీ కేబినెట్ లో మెరుగైన పనితీరు కనబరుస్తున్న తొలి ఆరుగురు మంత్రులు వీరేనంటూ తాజాగా వచ్చిన ఓ సర్వే తేల్చి చెప్పేసింది. ఈ ఆరుగురిలో తెలుగు నేలకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా ఉండటం గమనార్హం. ఈ జాబితాలో వెంకయ్యకు నాలుగో స్థానం దక్కింది. అంటే... ఉప రాష్ట్రపతిగా వెంకయ్యను పంపించివేయడంతో తన కేబినెట్ లో ఉత్తమంగా రాణిస్తున్న ఓ కీలక మంత్రిని మోదీ స్వయంగా పాలనకు దూరం చేసేశారన్న మాట.
ఇక మిగిలిన ఐదుగురు బెస్ట్ మినిస్టర్స్ ఎవరన్న విషయానికి వస్తే... ఏ శాఖ ఇచ్చినా తనదైన శైలిలో రాణించే సత్తా ఉన్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఇండియా టుడే- కార్వీ ఇన్ సైట్స్ సంస్థలు నిర్వహించిన ఈ సర్వేలో జైట్లీ పనితీరుకు 28 శాతం మంది ఓటేశారు. ఇక జైట్లీ తర్వాతి స్థానం బీజేపీ సీనియర్ నేతగా, గడచిన ఎన్నికల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చక్రం తిప్పిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిలిచారు. రాజ్ నాథ్ కు సర్వేలో 26 శాతం మార్కులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ (21 శాతం) మూడో స్థానంలో - రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (14 శాతం) ఐదో స్థానంలో - సురేశ్ ప్రభు (10 శాతం) ఆరో స్థానంలో నిలిచారు.
ఇక టోటల్‌గా మోదీ గవర్నమెంట్ సాధించిన విజయాల విషయానికి వస్తే... నల్లధనంపై ప్రభుత్వం చేసిన పోరాటానికి అధిక శాతం ఓట్లు వచ్చాయి. అలాగే అవినీతి రహిత పాలన, పెద్ద నోట్ల రద్దుకు 14 శాతం, స్వచ్ఛ భారత్ కు 11 శాతం మార్కులు వచ్చాయి. ఇక మోదీ ఛాతీ ఉప్పొంగేలా చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌కు మాత్రం కేవలం 9 శాతం మార్కులే రావడం గమనార్హం. ఇక ఈ సర్వే మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏకంగా మూడొంతుల్లో రెండొంతుల మెజారిటీని దక్కించుకుంటుదట. అంటే వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి తిరస్కారమే ఎదురు కానుందన్న మాట.