దెయ్యం లాంటి సవతితల్లి చేతిలో దారుణ హింసకు గురైన ప్రత్యూష విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆమెను దారుణంగా హింసించిన కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఈ విషయంలో ఆమెను ఒత్తిడి చేయొద్దని చెప్పిన కోర్టు.. ప్రత్యూష ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయితే అప్పుడే ప్రవేశపెట్టాలని కోరారు.
ఉమ్మడి హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే.. జస్టిస్ ఎస్ వి భట్ లతో కూడిన ధర్మాసనం ప్రత్యూష విషయంపై స్పందిస్తూ.. ఒకవేళ ఆమెకు కోర్టుకు రావటం ఇబ్బంది అయితే.. బలవంతం పెట్టొద్దని కూడా సూచించారు. కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మీడియా కానీ.. ఎవరూ ఆమెను ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని.. ఆమెను న్యాయమూర్తులు వచ్చే లిఫ్ట్ లో కోర్టుకు తీసుకురావాలంటూ సూచనలు చేసింది. ప్రత్యూషకు ఏ చిన్న ఇబ్బంది కూడా కలగకూడదన్నట్లుగా హైకోర్టు భావన ఉండటం శుభ పరిణామం. గ్లోబల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ప్రత్యూషను హైకోర్టు ధర్మాసనం ముందు హాజరుపరిచారు.
మరోవైపు.. ప్రత్యూష విషయానికి వస్తే.. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాను బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. బీఎస్సీ నర్సింగ్ హాస్టల్ లో ఉండి చదువుకుంటానని.. పిన్ని.. తండ్రికి కఠిన శిక్షలు పడాలని కోర్టును కోరతానని పేర్కొంది. నర్స్ గా సేవలు అందించాలని తాను అనుకుంటున్నట్లు పేర్కొంది. ఆమె కల నెరవేరాలని కోరుకుందాం.