ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ లేనిదే రోజు గడవని పరిస్థితి వచ్చేసింది. కానీ... ఇంటర్నెట్ వేగం - ధరలు మాత్రం సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. ఈ పరిస్థితిని నివారించేందుకు దేశవ్యాప్తంగా ఉచితంగా ఇంటర్నెట్ అందించేందుకు మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా విడుదల చేసిన ఒక స్టేట్ మెంట్ దీనికి బలం చేకూరుస్తోంది. దేశవ్యాప్తంగా ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు ట్రాయ్ వెల్లడించింది. ఇదే నిజమైతే దేశంలో సరికొత్త ఇంటర్నెట్ విప్లవం గ్యారంటీ.
సర్వీస్ ప్రొవైడర్ తో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా ఇంటర్నెట్ డేటాను కేటాయించడం లేదా వినియోగించిన డాటాను రీయింబర్స్ చేసే పథకాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ప్లాట్ ఫాంను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతకుముందు ఫేస్ బుక్ సంస్థ తెరపైకి తెచ్చి - ట్రాయ్ నుంచి తిరస్కారం ఎదుర్కున్న ‘ఫ్రీబేసిక్స్’ తరహాలో కాకుండా... ఉచితంగా వచ్చే డేటాతో ఇంటర్నెట్ లో ఏవెబ్ సైట్ అయినా చూసుకునేలా, ఏ సమాచారమైనా పొందేలా ఏర్పాట్లు చేయబోతున్నారు.
‘ఫ్రీబేసిక్స్’ను తిరస్కరించిన తర్వాత పలు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తమ సమస్యలను ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో... తాజా స్టేట్ మెంట్ లో ట్రాయ్ పలు సూచనలు చేసింది. ‘అండర్ కనెక్టెడ్’ - ‘అన్ కనెక్టెడ్’ జనాభా ప్రాంతాల కింద విభజించి వీటిలో ఏ మోడల్ ను తీసుకోవాలో జూన్ 16వ తేదీలోగా సూచించాలని కోరింది. ట్రాయ్ తాజా నిర్ణయంపై నెట్ న్యూట్రాలిటీ మద్దతుదారులు - ఇంటర్నెట్ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రాయ్ తాజా పత్రంలో సూచించిన అంశాలపై విమర్శలూ వస్తున్నాయి. వెబ్ సైట్లలో వినియోగించిన డేటాపై నిఘా ఉంచి డేటాను రీయింబర్స్ చేయడం నెట్ న్యూట్రాలిటీకి విరుద్ధమేనని అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి ఉచిత ఇంటర్నెట్ ఇస్తే మాత్రం మోడీ మరో టెర్ము అధికారంలోకి రావడానికి పునాది పడినట్లే. తమిళనాడు ఉచిత హామీల ప్రభావాన్ని చూసిన తరువాత మోడీ కూడా అదే ఫార్ములా ఫాలో కావాలని డిసైడైనట్లు కనిపిస్తోంది మరి.