ఐఏఎస్ ల మరణాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా యువ ఐఏఎస్ ల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక ట్రైనీ మహిళా ఐఏఎస్ అధికారిణిని రక్షించే క్రమంలో తన ప్రాణాల్ని పోగొట్టుకున్న అధికారి ఉదంతమిది. దక్షిణ ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ ఉన్న 30 ఏళ్ల అశీష్ దహియా సోమవారం సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి ఇనిస్టిట్యూట్ లో ఉన్న స్విమ్మింగ్ ఫూల్ కు వెళ్లారు.
ఇంతలో ఒక మహిళా అధికారి ప్రమాదవశాత్తు జారి స్విమ్మింగ్ ఫూల్ లో పడిపోయారు. ఆమెను రక్షించేందుకు కొందరు ట్రైనీ ఐఏఎస్ లు స్విమ్మింగ్ ఫూల్ లోకి దూకారు. అలా దూకిన వారిలో ఆశీష్ ఒకరు. అయితే.. ఈత రాకుండానే ఆశీష్ దూకటం.. ఆ విషయాన్ని సహచరులు గుర్తించి.. అతన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరిన ఆశీష్ ను వైద్యాధికారులు అతడ్ని కాపాడలేకపోయారు. స్విమ్మింగ్ ఫూల్ లోకి దూకిన సమయంలో ఆశీష్ మద్యం సేవించి ఉన్నారా? అన్న సందేహంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి సహచరుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. ఈ కేసును విచారిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/