ఆగస్టు 12 వరకు అన్ని రైళ్లు రద్దు !
దేశంలో వైరస్ మహమ్మారి రోయ్జురోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారవాణా వ్యవస్థ ఇప్పుడప్పుడే పున:ప్రారంభమయ్యేలా లేదు. ఇప్పటికే మూడు నెలలకు పైగా రైళ్లన్నీ స్తంభించిపోగా.. సర్వీసుల రద్దును ఆగస్టును 12 వరకూ పొడిగిస్తున్నట్లు రైల్వే బోర్డు గురువారం కీలక ప్రకటన చేసింది. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్, సబర్బన్ సర్వీసులతో సహా అన్ని సర్వీసు రైళ్లను ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే బోర్డు గురువారం ప్రకటించింది.
కాగా, లాక్ డౌన్ సమయంలో తీసుకువచ్చిన 230 ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేసింది. లాక్ డౌన్ సడలింపులు మొదలైనప్పటి నుంచీ రైల్వే సర్వీసుల విషయంలో గందరగోళం ఏర్పడుతూ రావడం తెలిసిందే. గతంలో పలు మార్లు సర్వీసులు ప్రారంభిస్తామన్న బోర్డు.. ఆఖరి గంటల్లో నిర్ణయాన్ని మార్చుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు ఆన్ లైన్ లో, స్టేషన్ల రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుకింగ్ చేసుకున్న టికెట్లన్నీ రద్దయిపోతాయని అధికారులు తెలిపారు. ఆ డబ్బు మొత్తం వాపస్ ఇస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
మరోవైపు రెగ్యులర్ టైమ్ టేబుల్ రైళ్లలో ప్రయాణించేందుకు 2020 ఏప్రిల్ 14న లేదా అంతకన్నా ముందు బుక్ చేసిన రైలు టికెట్లన్నీ రద్దు చేస్తున్నట్టు రెండు రోజుల క్రితం ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఆ ప్రయాణికులకు కూడా ఫుల్ రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. భారతీయ రైల్వే రద్దు చేసిన రైలు టికెట్లకు గతంలో ప్రకటించిన రీఫండ్ నిబంధనలే వర్తిస్తాయి. వైరస్ సంక్షోభం సమయంలో రీఫండ్ రూల్స్‌లో కొన్ని మార్పులు చేసిన సంగతి తెలిసిందే.