ఫ్లోరిడా విమానాశ్రయంలో జరిగిన కాల్పుల ఉదంతంలో అనూహ్యమైన వార్త ఒకటి తెరమీదకు వచ్చింది. ఈ కాల్పుల్లో స్టీవ్ ఫ్రాపియర్ ఓ వ్యక్తి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అందులో విశేషం ఏమిటంటే ఆ వ్యక్తిని తన ల్యాప్ టాప్ కాపాడింది! నిజంగా లాప్ టాప్ వల్లే ఆయన బతికిపోయాడు.
ఆగంతకుడు కాల్పులు జరుపుతున్న సమయంలో అందరూ హడావుడిగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. స్టీవ్ కూడా అదే తరహాలో విమానాశ్రయం నుంచి బయటపడేందుకు పరుగులు తీశాడు. అయితే భుజానికి వేసుకున్న ల్యాప్ టాప్ బ్యాగే ఆయనకు రక్షణ కవచంగా మారింది. పరుగులు తీస్తున్న స్టీవ్ దిశగా షూటర్ కాల్పులు జరిపాడు. తన వీపులో ఉన్న బ్యాగ్ కు ఏదో తగిలినట్లు స్టీవ్‌కు అనిపించింది. అయినా ప్రాణ భయంతో అలాగే పరుగులు తీశాడు. వాష్ రూమ్ కు వెళ్లిన తర్వాత బ్యాగ్ చూడగా.... ల్యాప్ టాప్ కు బుల్లెట్ తగిలినట్లు గ్రహించాడు. ఆ బ్యాగ్ ను అతను వెంటనే పోలీసులకు అప్పగించాడు. ఒకవేళ బ్యాగ్ లో ల్యాప్ టాప్ లేకుంటే ఆ బుల్లెట్ తన వీపులో దిగేదని స్టీవ్ వెల్లడించాడు. విమానాశ్రయంలో సుమారు 45 సెకండ్ల పాటు కాల్పులు జరిగినట్లు మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
కాగా ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న ఫోర్ట్ లాడెర్ డేల్-హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) ఓ దుండుగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని, కనీసం 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారని అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. కాల్పులు జరిపింది ఒక్కడేనని అతడితోపాటు ఇతరులు పాల్గొన్నట్లు తాము భావించటం లేదన్నారు. ఈ ఘటన నేపథ్యంలో విమానాశ్రయం అధికారులు అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
కాల్పులు జరిగిన సమయంలో విమానాశ్రయంలో ఉన్న వైట్ హౌస్ మీడియా మాజీ కార్యదర్శి అరీ ఫీషర్ మాట్లాడుతూ... తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దాంతో అందరూ తలోదిక్కున పరుగు తీశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం పోలీసుల అదుపులో ఉంది అని తెలిపారు. ప్రయాణికులు తమ బ్యాగులను తీసుకునే టర్మినల్ 2 ప్రాంతంలో కాల్పులు జరిగినట్లుగా సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/