గర్భిణి అరణ్య రోదన: కాలి నడకన తీసుకెళ్తుండగా అడవిలో ప్రసవం

Update: 2020-07-19 04:41 GMT
అడవిబిడ్డల కష్టాలు2020లోనూ తీరడం లేదు. మౌలిక సదుపాయాలు.. సౌకర్యాలు వారికి అందుబాటులో లేవు. విద్య వైద్యం వారికి ఇప్పటికీ అందని ద్రాక్షగా మారింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోయం జరిగింది. పురిటినొప్పులు రావడంతో అంబులెన్స్ కు ఫోన్ చేయగా రాలేదు. దీంతో భర్త ఆమెను తన చేతులపై మూడు కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఆ క్రమంలోనే నొప్పులు తీవ్రమై చీవరకు ఆమె మార్గమధ్యలోనే రోడ్డుపై ప్రసవించింది.

చర్ల మండలం ఎర్రంపాడుకి చెందిన కొవ్వాసి ఐతే నిండు గర్భిణి. ఆమెకు శనివారం పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్స్ వచ్చే దారి లేక - ఏమీ చేయలేని పరిస్థితుల్లో కాలినడకలోనే భర్త ఆమెను ఎర్రంపాడు నుంచి చెన్నారం వరకు 3 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. సమాచారం అందుకున్న ఆశా కార్యకర్త సోమమ్మ సహాయం చేసింది. అయితే అక్కడ ఫోన్ సిగ్నల్ రావడంతో స్థానిక యువకులు 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్ రావడం ఆలస్యమవడంతో ఆమె అడవిలోనే ప్రసవించింది. ఆ తర్వాత వచ్చిన అంబులెన్స్లో బాలింతను - శిశువును ఎక్కించి సత్యనారాయణపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలపడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Tags:    

Similar News