రెండంటే రెండు ప్రధాన సామాజిక వర్గాలే తమను రూల్ చేస్తున్నాయని ఎప్పటి నుంచో మిగతా వర్గాలు అంతర్మథనం చెందుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలు పుట్టినా కూడా అక్కడే ఇవే హవాను నడుపుతున్నాయని సామాజిక విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా ఆ రోజు చంద్రబాబు హయాంలో చౌదరి సామాజికవర్గమే అంతా తామై నడిపారని వైసీపీ విమర్శలు చేసింది. ఆధారాలు చూపింది. ఆ విధంగా చౌదరి సామాజికవర్గంపై కోపం కూడా అయింది.తరువాత ఎందుకనో తగ్గిపోయింది. ఇప్పుడు వైసీపీ రూలింగ్ లో ఉంది కనుక రూట్ మారింది అని అంటోంది టీడీపీ మరియు జనసేన.
ఆర్ ఫర్ రెడ్డి ఆర్ ఫర్ రాజు ఆర్ ఫర్ రాజ్యం కూడా !ఈ ట్రిపుల్ ఆర్ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. ఆ విధంగా ఉండడంపై జనసేన అభ్యంతరం తెలుపుతోంది. తెలంగాణ విషయంలో కాదు కానీ ఆంధ్రా విషయంలోనే అభ్యంతరం తెలుపుతోంది. ఇదే స్పీడు తెలంగాణలో ఎందుకనో చూపలేకపోతోంది. ఓ విధంగా అక్కడ పార్టీ సంస్థాగతంగా లేదు కనుక మాట్లాడడం లేదేమో ! ఏదేమయినా ఎవరి రాజ్యంలో వారు ఉండడమే మేలు. అదేం తప్పు కాదు.
కుల స్పృహ కాస్త ఎక్కువగా ఉండే ఆంధ్రాలో రెడ్డి రాజులు ఎప్పటి నుంచో తమ హవా చూపిస్తూనే ఉన్నారు. రూలింగ్ సెక్టార్ ను రెడ్డి తరువాతే కదా చౌదరి సామాజికవర్గం ఏలుతోంది లేదా శాసిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గంలో ఇద్దరే ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్లే ఎన్టీఆర్ మరియు చంద్రబాబు.
చంద్రబాబు తరువాత వైఎస్సార్, తరువాత కొద్ది కాలం రోశయ్య (ఆర్య వైశ్య, ఉత్తరాంధ్రతోనూ ఈ సామాజిక వర్గంకు అనుబంధం ఉంది), అటుపై కిరణ్ కుమార్ రెడ్డి. మళ్లీ చంద్రబాబు (అవశేషాంధ్రకు), ఇప్పుడు జగన్.. మళ్లీ కూడా జగన్ మోహన్ రెడ్డి కావొచ్చు. అంటే ఎక్కువ శాతం రెడ్డి సామాజికవర్గం రూలింగ్ నుంచి ఉమ్మడి ఆంధ్రా తప్పుకోలేదు. అలానే ఇప్పుడు తిరుపతి జిల్లా కూడా తప్పుకోలేదు అని అంటోంది జగన్ ను ఉద్దేశించి జగన్.
తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి నుంచి ఈఓ జవహర్ రెడ్డి వరకూ అంతా రెడ్డీలనే నియమించారని జగన్ ను ఉద్దేశించి చెబుతోంది జనసేన.ఎస్పీ పరమేశ్వర రెడ్డి నుంచి టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి వరకూ అంతా రెడ్డీలనే నియమించారని నిన్నటి నుంచి నెత్తీ నోరూ మొత్తుకుంటోంది.
ఇవే కాదు ముఖ్యమయిన శాఖలకు అధిపతులను నియమించిన క్రమంలో కూడా అంతా రెడ్డీలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు అని పేర్లతో సహా ఆధారాలతో సహా వెల్లడి చేసింది. కానీ ఇదంతా తాము కోరుకుని చేసింది కాదని యాదృచ్ఛికమేనని వైవీ సుబ్బారెడ్డి (టీటీడీ చైర్మన్) అంటున్నారు.ఇదే మాట సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా అంటున్నారు. ఇదే మాట సీఎం జగన్ కూడా అంటే అంటారు...అన్నది జనసేనాని పవన్ పెదవి విరుపు.