నాసా ఇటీవల చేసిన ఒక పని సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్ అవుతోంది. అది కూడా భారతీయ ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం. నాసా తాజాగా కొత్త ఇంటర్న్ ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సందర్భంగా తన మాజీ ఇంటర్న్ ల కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. యూఎస్ అంతరిక్ష సంస్థలో పనిచేస్తున్న ప్రజల వైవిధ్యాన్ని ప్రదర్శించాలనే ఆలోచనతో నాసా ఈ పనికి పూనుకున్నారు. అయితే, ఈ ప్రయత్నాన్ని విమర్శిస్తూ చాలామంది నాసా పై ట్రోల్స్ చేశారు.
అయినా నాసా షేర్ చేసిన ఆ ఫొటోలో ఏముంది అంటే .. మొత్తం నలుగురు ఇంటర్న్ ల చిత్రాలను నాసా షేర్ చేసింది. వీరిలో ఒకరు భారతీయ అమెరికన్ అమ్మాయి. ఈమె నాసా లోగోతో ఉన్న ఊలుకోటు ధరించి కూర్చుని ఉన్నారు. ఆమె పక్కన డెస్క్ పై హిందూ దేవుళ్ళ బొమ్మలు వెనుక గోడపై దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. వాటిని చూసిన నెటిజన్లు ఒక రేంజిలో నాసాపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. యూఎస్ అంతరిక్ష సంస్థ ఒక శాస్త్రీయ సంస్థ అని అంటున్న నెటిజన్లు ఏవిధంగా దేవుణ్ణి విశ్వసించే వారిని తన ఇంటర్న్ షిప్ కు అనుమతిస్తారంటూ ప్రశ్నలు సంధించారు.
అయితే, నాసాకు ఈ ట్రోలింగ్ విషయంలో ఊహించని స్థాయిలో మద్దతు కూడా లభించింది. ట్రోలర్స్ ను ఎదుర్కుంటూ పలువురు నాసా తరఫున, ఆ ఫోటోలోని అమ్మాయి తరఫున పోస్ట్ లు పెట్టారు. ఆమె తన డెస్క్ మీద దేవుళ్ళ విగ్రహాలు ఉంచుకోవడంలో తప్పేముంది అంటూ ఎదురుదాడికి దిగారు. నాసా చేసిన పనిలో అస్సలు తప్పు లేదన్నారు. ఆమె వ్యక్తిగత పరిస్థితులను నాసా అడ్డుకోకపోవడం గొప్పవిషయం అంటూ సపోర్ట్ చేశారు. అంతేకాదు, ఇటువంటి పనికిమాలిన విషయాలపై ట్రోలింగ్ చేయకుండా పనికొచ్చే విషయాల గురించి ఆలోచించమని హితవు చెబుతూ కొందరు పోస్ట్ చేశారు. ఇలా ఎదురుదాడి మొదలవడంతో ట్రోలర్స్ వెనక్కి తగ్గారు. తమ కామెంట్ల జోరును ఆపేశారు. మొత్తమ్మీద నాసా చేసిన పనిని సమర్ధించిన వారే ఎక్కువ.
ఒక యూజర్ ట్విట్టర్ లో ఆమెకి మద్దతు తెలుపుతూ ..ఆమెను ఎగతాళి చేసే వారందరికీ.. హిజాబ్, బహుభార్యాత్వం, బాల్యవివాహాలు, నికాబ్, రహదారిపై ప్రార్థనలు మొదలైనవి ‘ఎంపిక’, ‘బహువచనం’ అనే భావన క్రింద గౌరవించబడాలి. కానీ, తన విశ్వాసాన్ని పాటిస్తున్న హిందూ మహిళను ఎగతాళి చేయాలి. కొనసాగించండి మీ మూర్ఖత్వం ఆమె విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది అని అన్నారు. నాసా ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ను చూస్తే .. నిజానికి ఈ ఫోటోలో మహిళ నేపధ్యంలో కనిపించిన లక్ష్మీ, సరస్వతీ ఇతర దేవుళ్ళ విగ్రహాలు భారతీయ గృహాలలో సాధారణంగా కనిపించే దృశ్యమే. ఆ మహిళా భారతీయురాలు అయినందున సహజంగానే ఫోటోలో అలా కనిపించింది.