గత కొంతకాలంగా ఊహించినట్లుగానే మాజీ వివేక్ బీజేపీ గూటికి చేరడం ఖాయమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ తరఫున కరీంనగర్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ వివేక్ ఆ తరువాత పార్టీకి రాజీనామా చేశారు. కొన్ని రోజులుగా బీజేపీ జాతీయ స్థాయి నేతలతో టచ్ లో ఉన్న వివేక్ పార్టీలో చేరేందుకు సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఆయన మంగళవారం బీజేపీ అధినేత అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో వివేక్ సోదరుడు వినోద్ టీఆర్ ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో - బీఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే, స్థానిక ఎమ్మెల్యేలు, నేతల వ్యతిరేకత నెపంతో వివేక్‌కు 2019 ఎన్నికల పోరులో ఎంపీ టికెట్ కేసీఆర్ నిరాకరించారు. ఈ సమయంలో వివేక్ టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా సందర్భంగా కేసీఆర్‌కు వివేక్ బహిరంగ లేఖ రాశారు. తన తండ్రి కాకా - తాను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చానని.. తెలంగాణ కోసం పనిచేయడం - ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడడమే పార్టీకి ద్రోహం చేయడమా? అని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారమే తాను పోటీ చేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరి క్షణంలో టికెట్ నిరాకరించారని ఆరోపించారు. టికెట్ హామీ ఇచ్చి కూడా తనను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారని అన్నారు. కేసీఆర్ ఆటబొమ్మలు కొందరు తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయిందని వివేక్ పేర్కొన్నారు.2014లో టీఆర్ ఎస్ లో ఇద్దరు ఎంపీలే ఉంటే తాను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే ద్రోహమా? అని అన్నారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం చేయనివాళ్లకు టికెట్లిచ్చారని దుయ్యబట్టారు.
కాగా, పార్లమెంటు ఎన్నికల నామినేషన్ ముందు వరకు వివేక్ పెద్దపల్లిలో పోటీచేసేందుకు బీజేపీ,కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతూనే వచ్చారు. బీజేపీ అదిష్టానం పెద్దపల్లి టికెట్ అవకాశం చివరి నిమిషం వరకు ఇచ్చినప్పటికీ వివేక్ బీజేపీ విషయంలో పెద్దగా ఆసక్తి కనపర్చలేదు. చివరకు ఇండిపెండెంట్ గా పోటీచేద్దామని భావించినప్పటికీ సమయం తక్కువగా ఉండటంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇచ్చే గుర్తు ప్రజల్లోకి బలంగా వెళ్లలేదని భావించి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్న ఆయన పార్టీ రథసారథి అమిత్‌షా ఓకే చెప్పేయడంతో...కాషాయ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.