క‌రోనాతో టీఆర్ఎస్ నేత మృతి.. డ‌బ్బులిస్తేనే బాడీ ఇస్తామ‌న్న ఆసుప‌త్రి!

Update: 2021-04-27 14:31 GMT
క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్ర‌జ‌లు వేలాదిగా ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ.. ఇలాంటి దారుణ ప‌రిస్థితుల్లో కూడా ఆసుప‌త్రులు డ‌బ్బులు దండుకుంటున్నాయ‌నే విమ‌ర్శ‌లు ఎన్నో రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ వ్య‌క్తి మ‌ర‌ణించ‌గా.. 2 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లిస్తే త‌ప్ప మృత‌దేహాన్ని అప్పగించేది లేద‌ని చెప్పింద‌ట ఓ ఆసుప‌త్రి యాజ‌మాన్యం!

మేడ్చ‌ల్ జిల్లా రాంప‌ల్లికి చెందిన టీఆర్ఎస్ నాయ‌కుడు నీరుడు వాసు క‌రోనా బారిన ప‌డ్డాడు. ఐదు రోజుల క్రితం కాప్రాలోని ఓ ఆసుప‌త్రిలో చేరాడ‌ట‌. అయితే.. వాసు ఆరోగ్యం మెరుగు ప‌డ‌క‌పోగా.. మ‌రింత క్షీణించ‌డంతో మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచాడు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ చికిత్స కోసం రూ.ల‌క్ష‌న్నర‌ చెల్లించార‌ట కుటుంబ స‌భ్యులు. కానీ.. ఇంకా రూ.2 ల‌క్ష‌లు చెల్లించాల్సి ఉంద‌ని చెప్పింద‌ట ఆసుప‌త్రి యాజ‌మాన్యం. ఆ మొత్తం చెల్లిస్తే త‌ప్ప‌, మృత‌దేహాన్ని అప్ప‌గించేది లేద‌ని చెప్పార‌ట‌. దీనిపై కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆసుప‌త్రి ఎదుట ఆందోళ‌న‌కు దిగిన‌ట్టు స‌మాచారం.

ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌క్ష‌న్న‌ర తీసుకోవ‌డ‌మే కాకుండా.. ఇంకా రెండు ల‌క్ష‌లు తెమ్మంటే ఎక్క‌డి నుంచి తేవాల‌ని కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తంచేశారు. అయిన‌ప్ప‌టికీ.. డ‌బ్బులు చెల్లిస్తేనే బాడీని ఇస్తామ‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు చెప్పిన‌ట్టు స‌మాచారం. అప్ప‌టి వ‌ర‌కూ మృత‌దేహాన్ని మార్చురీలో ఉంచుతామ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News