ఆస‌క్తిక‌రంగా గులాబీ నేత‌ల విహార‌యాత్ర‌లు

Update: 2017-05-22 06:30 GMT
ఎండ‌లు మండుతున్నాయి. గిట్టుబాటు ధ‌ర‌లు లేక రైతులు ఉద్య‌మిస్తున్నారు. నీటి క‌ష్టాల‌తో క‌ట‌క‌ట‌లాడుతున్న‌గ్రామాల‌కు కొద‌వ లేదు. ఇలా ఎవ‌రి స‌మ‌స్య‌ల్లో వారు ఉన్న వేళ‌.. తెలంగాణ అధికార‌పక్ష నేత‌లు మాత్రం ఎంచ‌క్కా విహార‌యాత్ర‌ల‌కు వెళుతున్న వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. కొంద‌రు అధికారిక ప‌ర్య‌ట‌న‌ల్లో రాష్ట్రాన్ని విడిచిపెడితే.. మ‌రికొంద‌రు విహార‌యాత్ర‌ల్లో భాగంగా వేర్వేరు ప్రాంతాల‌కు వెళ్లిపోయారు.

ముఖ్య‌నేత‌లు మొద‌లుకొని ఒక మోస్త‌రు నేత‌ల వ‌ర‌కూ అంతా విహార‌యాత్ర‌లో బిజీగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ప‌నుల ఒత్తిడితో పాటు.. మంట పుట్టించే ఎండ మంట నుంచి కాసిన్ని రోజులు కూల్ కూల్‌గా గ‌డ‌ప‌టానికి టూర్ల‌కు వెళుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్‌.. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌టం తెలిసిందే. ఇక‌.. పలువురు మంత్రులు విదేశాల‌కు అధికారిక ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లారు.

అంతేనా.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు సైతం విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిన జాబితాలో ఉన్నారు. ఎమ్మెల్యే బాల‌రాజు సింగ‌పూర్ టూర్‌కి వెళితే.. ఎమ్మెల్యే గ‌ణేష్ యూర‌ప్‌కి వెళ్లారు. ఇక‌.. ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి అమెరికాకు వెళ్లారు. ఇక‌.. రాష్ట్ర ఆర్థిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్‌.. శ్రీన‌గ‌ర్లో జ‌రిగిన జీఎస్టీ స‌మావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఇలా గులాబీ నేతలు ప‌లువురు అధికార‌.. అన‌ధికార యాత్ర‌ల‌కు వెళ్ల‌టం విశేషంగా చెప్పాలి.
Tags:    

Similar News