ప‌వ‌న్‌ కు సారు అంత ప్ర‌యారిటీ ఇచ్చుడేంది?

Update: 2018-01-05 07:17 GMT
కొత్త సంవ‌త్స‌రం వేళ‌.. ఊహించ‌ని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లు భేటీ కావ‌టం రాజ‌కీయ సంచ‌లంగా మారింది. వీరిద్ద‌రి భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. కేసీఆర్‌ను క‌ల‌వ‌టానికి వ‌చ్చిన ప‌వ‌న్ ను.. ఆయ‌న ఇంట్లో లేని కార‌ణంగా గంట‌కు పైనే వెయిట్ చేయాల్సి వ‌చ్చింద‌ని.. దీనిపై ప‌వ‌న్ అభిమానులు కినుకు వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్ చేత గంట పాటు వెయిట్ చేయించేలా చేయ‌టంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యారంటూ అభినందిస్తున్న‌వారు లేక‌పోలేదు. ఇదిలా ఉంటే.. కేసీఆర్ తో భేటీ కార‌ణంగా ప‌వ‌న్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ జ‌రిగింద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు.. ప‌వ‌న్ తో భేటీ విష‌యంపై తెలంగాణ అధికార‌ప‌క్షంలోనూ కొంత అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌వ‌న్‌ కు అవ‌స‌రానికి మించిన ప్రాధాన్య‌త‌ను సీఎం కేసీఆర్ ను ఇచ్చిన‌ట్లుగా కొంద‌రు మంత్రులు... టీఆర్ ఎస్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏ స్థాయి ఉంద‌ని త‌న ప‌క్క‌నే.. తాను కూర్చున్న మాదిరి కుర్చీలో ప‌వ‌న్ ను కేసీఆర్ సార్ కుర్చోబెట్టార‌న్న కంప్లైంట్ ప‌లువురి నోట వినిపిస్తోంది.

త‌న ప‌క్క‌న ప‌వ‌న్ ను కూర్చోబెట్టుకోవ‌టం ద్వారా భారీ ప్ర‌యారిటీ ఇచ్చారంటూ కొంద‌రు గులాబీ నేత‌లు గుర్రుగా ఉంటే.. అదంతా వ్యూహాత్మ‌క‌మ‌ని.. గంట సేపు వెయిట్ చేయించి.. త‌న ప‌క్క‌న ప‌వ‌న్‌ను కూర్చోబెట్టుకోవ‌టం ద్వారా కేసీఆర్‌కు లాభం జ‌రిగిందా?  లేదా? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ప‌వ‌న్‌కు మాత్రం భారీ డ్యామేజ్ జ‌రిగింద‌న్నది మ‌ర్చిపోకూడ‌దంటున్నారు. గంట‌సేపు వెయిట్ చేయించిన కేసీఆర్‌.. తాను వ‌చ్చిన త‌ర్వాత త‌న ఇంటికి వ‌చ్చిన అతిధిని మ‌రిపించేలా మ‌ర్యాద చేయ‌టం ద్వారా.. అంత‌కు ముందు జ‌రిగిన దానిని వ‌దిలేస్తార‌న్న మాట‌ను చెబుతున్నారు. ఏమైనా.. ప‌వ‌న్ కు ప్ర‌యారిటీ ఇవ్వ‌టాన్ని గులాబీ నేత‌లు ప‌లువురు జీర్ణించుకోలేక‌పోతున్నార‌న్న టాక్ బ‌య‌ట జోరుగా వినిపిస్తోంది.
Tags:    

Similar News