బాజిరెడ్డి.. ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టారా?

Update: 2016-04-13 05:18 GMT
జాతీయ పార్టీల తీరు కాస్త వేరుగా ఉంటుంది. కానీ.. ప్రాంతీయ పార్టీల తీరు అందుకు భిన్నం. దీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి రావటం వల్ల కావొచ్చు.. ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ లో  సరిగా ఇమడలేకపోతున్నట్లుంది నిజామాబాద్ రూరల్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధనరెడ్డి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఎంత పవర్ ఫుల్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. పార్టీ అధినేత కుమార్తె వేసిన ప్రశ్నకు బాజిరెడ్డికి ఆగ్రహం వచ్చేసింది.

చిన్న చిన్న లెక్కల గురించి లైట్ తీసుకోవాలే కానీ.. వేలెత్తి చూపించటం ఏ మాత్రం నచ్చలేదు. తనలాంటి నాయకుడ్ని అలా నిలదీస్తారా? అని అనుకొని ఉండొచ్చేమో కానీ.. కేసీఆర్ కుమార్తె అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆయన వ్యవహరించిన శైలి పార్టీలో ఇప్పుడు చర్చగా మారింది. ఈ మధ్యన పార్టీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిని లెంపకాయ కొట్టిన తీరు విమర్శలకు తెర తీస్తే.. తాజాగా కవితక్క విషయంలోనూ ఆయన వ్యవహరించిన తీరు చర్చగా మారింది.

తాజాగా.. ఎంపీ కవిత నేతృత్వంలోని నిజామాబాద్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. అయితే.. ఉపాధి హామీ నిధులు వెనక్కి వెళ్లటంపై ఎంపీ కవిత ప్రశ్నించారు. ఎందుకిలా జరిగిందంటూ ఎమ్మెల్యే బాజిరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. దీంతో.. విపరీతమైన అసహనాన్ని వ్యక్తం చేసిన బాజిరెడ్డి సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోవటం అందరిని అవాక్కు అయ్యేలా చేసింది. ఎవరి విషయంలో ఇలా వ్యవహరించినా ఫర్లేదు. కానీ.. అందుకు భిన్నంగా పార్టీ అధినేత కుమార్తె పైనే ఆగ్రహం చేసిన బాజిరెడ్డి తీరుపై  ఎంపీ కవిత ఎలా రియాక్ట్ అవుతారో..? తన తండ్రి కమ్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News