తెలంగాణలో మహమ్మారి వైరస్ కోరలు చాస్తోంది. సామన్యులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులనే కాదు.. ఇప్పుడు ప్రజాప్రతినిధులను వదలడం లేదు.
తాజాగా తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా తేలడం కలకలం రేపింది. తెలంగాణలో ఎమ్మెల్యేకు సోకిన తొలి కేసుగా దీన్ని పరిగణిస్తున్నారు.
టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ అని వైద్యులు గుర్తించారు. ఆయన కరోనా లక్షణాలతో ఉండగా.. వైరస్ అనుమానంతో పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో తెలంగాణలో కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కావడం గమనార్హం.
ఇతర రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, జాతీయ స్థాయి నేతలకు సైతం కరోనా బారిన పడగా.. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఓ ప్రజాప్రతినిధికి ఇలాంటి ఘటనలు నమోదు కాలేదు.
మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రరెడ్డికి మాత్రం కరోనా బారిన పడి ఆయన విజయవంతంగా కోలుకున్నారు.