సంచలనం... ప్రగతి భవన్ లోకి పద్మకు నో ఎంట్రీ!

Update: 2019-09-07 09:41 GMT
తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత - టీఆర్ ఎస్ తొలి టెర్మ్ లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించిన పద్మా దేవేందర్ రెడ్డికి నిజంగానే తీవ్ర అవమానం జరిగిపోయింది. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లోకే ఆమెకు ఎంట్రీ లభించలేదు. గేటు వద్దే ఆమెను అడ్డుకున్న ప్రగతి భవన్ సెక్యూరిటీ లోపలికి అనుమతి లేదని ఖరాఖండీగా చెప్పేశారు. దీంతోె చేసేదేమీ లేక అక్కడే కొద్దిసేపు వేచి చూసిన పద్మ... ఇక లాభం లేదనుకుని వెనుదిరిగారట. శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన పెను కలకలమే రేపుతోంది.

ఈ ఘటన పూర్వపరాల్లోకి వెళితే... తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గవర్నర్ గా ఎంట్రీ ఇచ్చి కొత్తగా ఏర్పాటైన తెలంగాణకు తొలి గవర్నర్ గా సుదీర్ఘ కాలం పాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించి ఆ పదవి నుంచి తప్పుకుని వెళ్లిపోతున్న ఈఎస్ ఎల్ నరసింహన్ కు వీడ్కోలు పలికేందుకు కేసీఆర్ సర్కారు భారీగానే ఏర్పాట్లు చేసింది. కేసీఆర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన నరసింహన్ కు భారీ స్థాయిలో వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు జరగగా... ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకే పద్మ ప్రగతి భవన్ కు వచ్చారు. అయితే ఆమెను గేటు వద్దే అడ్డుకున్న సెక్యూరిటీ... ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదని తేల్చేశారు.

సెక్యూరిటీ మాటలతో షాక్ కు గురైన పద్మ నోట మాట రాలేదట. డిప్యూటీ స్పీకర్ గా పనిచే యడంతో పాటుగా పార్టీలో కీలక నేతగా ఉన్న తనకే ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేకపోవడానికి గల కారణాలు తెలియక అమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. అయినా కూడా సెక్యూరిటీ ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండానే ఆమెకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట. సెక్యూరిటీ ఇచ్చిన షాక్ తో పద్మ... గేటు బయటే నిలుచున్న సమయంలో అక్కడికి వచ్చిన మంత్రి తలసాని కుమారుడు, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సాయి కిరణ్ కు మాత్రం సెక్యూరిటీ లోపలికి ఆహ్వానం పలకడం గమనార్హం.

Tags:    

Similar News