కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్.. కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలనుఆయన కుమార్తె, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. రాహుల్గాంధీపై బీజేపీ ఎదురుదాడి చేసినప్పుడు.. రాజకీయాల్లో హుందాతనం కోసం అండగా నిలబడ్డారని గుర్తుచే శారు.
మాణిక్కం ఠాగూర్ ట్వీట్ను ఖండిస్తూ కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎవరి భిక్షా కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో.. ప్రజలు పోరాడి సాధించుకున్నారన్నారు. కేసీఆర్ నేతృత్వంలో జరిగిన పోరాటంలో చివరికి సత్యమే గెలిచిందన్నారు.
మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బీజేపీ అవమానిస్తే.. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ మద్దతుగా నిలబడ్డారని కవిత పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై.. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ వెనకబడినప్పుడు.. కేసీఆర్ అండగా నిలిచారన్నారు. రాజకీయాల్లో హుందాతనం కోసం కేసీఆరే తొలుత స్పందించారని.. కవిత స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని మాణిక్కం ఠాగూర్ను కవిత సూచించారు.
అంతకుముందు టీఆర్ ఎస్, బీజేపీని విమర్శిస్తూ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. లక్షల మంది తెలంగాణ యువకుల ఆకాంక్షలు, సోనియమ్మ సూచనలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. గత ఏడేళ్లలో జరగనిది ప్రస్తుతం జరుగుతోందని.. పార్టీ డిజిటల్ మెంబర్షిప్ను ఉద్దేశించి ట్వీట్లో పేర్కొన్నారు.
ఊసరవెల్లి లాంటి టీఆర్ ఎస్, మతోన్మాద పార్టీ బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పని కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదన్నారు. టీఆర్ ఎస్, బీజేపీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు వంటివని మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. దీనికి కౌంటర్‌గా కవిత షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.