తెలంగాణ ఉద్యమం జరిగిన వేళలో తరచూ ఒక మాట వినిపిస్తూ ఉండేది. సీమాంధ్ర పాలకుల కారణంగా తెలంగాణ కల్చర్ ను ఏ మాత్రం పట్టించుకోవటం లేదని. వారిని.. వారి కల్చర్ ను కాపాడేందుకే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంకణం కట్టుకున్నట్లుగా ప్రచారం జరిగేది. ఏపీ పాలకుల కారణంగానే తెలంగాణ కల్చర్ లో భాగమైన బోనాల్ని ఆంధ్రా నేతలు పట్టించుకోలేదన్న విమర్శ తరచూ వినిపించేది.
అప్పటి ఉద్యమ నేతల మాటల్ని విన్నప్పుడు.. అప్పుడప్పుడు ఉద్యమ నేత కేసీఆర్ నోటి నుంచి వచ్చిన వాదనల్ని విన్నప్పుడు నిజమే కదా? అనిపించేది. కట్ చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎనిమిదేళ్లు అయిపోయింది కూడా. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉన్నారు. మరి.. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ కల్చర్ కు కేరాఫ్ అడ్రస్ అయిన బోనాల వేళ.. కేసీఆర్ ఎందుకు కనిపించరు? అన్నది ప్రశ్న.
ఏ బోనాలకు సీమాంధ్ర పాలకులు ప్రాధాన్యత ఇవ్వలేదని.. వారు చిన్నచూపు చూస్తారన్న ప్రచారం జరిగినప్పుడు.. సొంత రాష్ట్రంలో.. తానే పాలకుడిగా ఉన్న వేళ.. ఉద్యమ సమయంలో తామెత్తి చూపిన విధానాల్ని మార్చాల్సిన అవసరం ఉంది కదా? ఈసారి అయితే వరదల కారణంగా మహంకాళి ఉజ్జయని అమ్మవారి(లష్కర్) బోనాలకు హాజరు కాలేదని అనుకుందాం. గత ఏడాది మాటేమిటి? ఆ మాటకు వస్తే.. గడిచిన ఎనిమిదేళ్లలో ఎన్నిసార్లు లష్కర్ బోనాలకు సీఎం హోదాలో కేసీఆర్ హాజరయ్యారు?
నిద్ర లేచింది మొదలు తెలంగాణ కల్చర్ గురించి అదే పనిగా మాట్లాడటమే కాదు.. బోనాలు సీమాంధ్ర పాలకులకు పట్టలేదన్న మాట వినిపించినప్పుడు.. సీఎం హోదాలో లష్కర్ బోనాలకు హాజరు కావటంతో.. దాని ప్రాధాన్యత మరింత పెరుగుతుంది కదా? ఇలా ఎందుకని సీఎంగా ఉన్న కేసీఆర్ హాజరు కారన్నది క్వశ్చన్. తన కుమార్తె స్వయంగా బోనం ఎత్తే లష్కర్ బోనాలకు సీఎం కేసీఆర్ హాజరైతే మరింత బాగుండేది కదా? ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నట్లుగా.. ఉమ్మడి పాలనలో సీఎం హాజరు కాకపోవటం తెలంగాణ ఆచారాల్ని.. కల్చర్ ను పట్టించుకోవటమే అయితే.. ఇప్పుడు జరుగుతున్నది మరేంటి? ఆ ప్రశ్న అందరి మదిలో మెదలాలి కదా?