డప్పు పాలిటిక్స్ కు తెరలేపిన టీఆర్ ఎస్!!

Update: 2018-10-21 14:30 GMT
డప్పు ఒక సంగీత వాయిద్యంగా అందరికి తెలుసు.  సాధారణంగా ఏ ఊరేగింపులోనూ దీన్ని విరివిగా ఉపయోగిస్తారు.  కొన్ని సంఘాలు ప్రచార పర్వంలోనూ డప్పును వినియోగిస్తుంటాయి. ‘డప్పు’ లేకుండా మతపరమైన ఊరేగింపు పూర్తయ్యింది  లేదు. అయితే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో విశేష బలమున్న అధికార టీఆర్ ఎస్ పార్టీకి డప్పు అతిపెద్ద ఆయుధంగా మారింది.

ఉత్తర తెలంగాణ అంతటా ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా టీఆర్ ఎస్ అత్యంత వెనుకబడిన వారికి - దళితులందరికీ ఈ డప్పుల పంపిణీ చేపట్టిందట.. ఇందుకోసం ఆయా కుల నాయకుడిని చేరదేసి కులసంఘాలతో రహస్య సమావేశాలను ఏర్పాటు చేసి అర్ధరాత్రుళ్లు  ఎమ్మెల్యే అభ్యర్థుల కింద ఉండే నేతలు పంపిణీ చేస్తున్నారట.. టీఆర్ ఎస్ కే ఓటు వేయాలని ఒట్టు వేయించుకున్నారట..

ఈ సమావేశాలను నిర్వహించేందుకు గాను వివిధ కులసంఘాల నాయకులకు పార్టీ తరఫున రూ.30వేలు ఇస్తున్నట్టు భోగట్టా.. వీటితోనే అవన్నీ కొనుగోలు చేసి పంచుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.  గులాబీ పార్టీ గెలిస్తే ఇంతకంటే ఎక్కువే తాయిలాలు ఇస్తామని వాగ్ధానాలు చేస్తున్నారట.. ఇదంతా మీడియా కంటపడకుడా.. ప్రచారానికి దూరంగా చేస్తుండటంతో వెలుగులోకి రావడం లేదు.

ఈ తాయిలాల అనంతరం టీఆర్ ఎస్ కోసం కుల సంఘాల నేతలందరూ పనిచేయాలని కోరుతున్నారట.. ప్రత్యేకంగా దళితులతోపాటు కులసంఘాల నేతలతో టీఆర్ ఎస్ ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం. నాయి బ్రాహ్మణ - వడ్రంగి - కుమ్మరి - కమ్మరి - నేతన్నలు సహా అన్ని కులసంఘాలకు వారి వారి వృత్తులకు సంబంధించిన పనిముట్లను రహస్యంగా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.  ఎమ్మెల్యే కింద ఉండే మూడోస్థాయి కార్యకర్తలు ఈ పంపిణీని సమాజానికి తెలియకుండా చేసేస్తున్నట్టు సమాచారం. అన్ని కులసంఘాలకు పంచేసి ఒట్టు వేయించుకుంటున్నట్టు తెలిసింది. ఇక మహిళలకు అద్దాలు - చీరలు - ఇతర సౌందర్య సాధానాలు కూడా పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. ఇలా బయటకు కనిపించని ఎన్నో విచిత్రాలు తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో చోటుచేసుకుంటుండడం విశేషంగా చెప్పవచ్చు.
Tags:    

Similar News