గులాబీ బ్యాచ్ కు అడ్వాంటేజ్ అదేన‌ట‌!

Update: 2018-09-05 07:40 GMT
ముంద‌స్తు ఖాయ‌మైన‌ట్లే. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టం మిన‌హా.. అన‌ధికారికంగా ఎవ‌రికి వారు ముంద‌స్తు హ‌డావుడిలో మునిగిపోయారు. ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా వ‌చ్చి ప‌డిన ముంద‌స్తు కోసం ఎవ‌రికి వారు చేసుకోవాల్సిన ఏర్పాట్లు అన్ని ఇన్ని కావు. అధికార‌ప‌క్ష నేత‌ల‌కు మొద‌ట్నించి కాస్త ఇండికేష‌న్లు ఉండ‌టంతో ఎవ‌రికి వారు ఇప్ప‌టికే చేసుకోవాల్సిన ఏర్పాట్లు చేసేసుకున్నారు.

ముంద‌స్తు వ్య‌వ‌హారంపై మిగిలిన వారితో పోలిస్తే.. అధికార‌ప‌క్ష‌మైన గులాబీ నేత‌ల‌కే అవ‌గాహ‌న ఉంద‌ని చెప్పాలి. నేరుగా చెప్ప‌కున్నా.. టికెట్లు ప‌క్కాగా ఇచ్చే నేత‌ల‌కు ఆర్నెల్ల ముందు నుంచే పిలిపించుకొని.. త‌గిన ఏర్పాట్లు జులై.. ఆగ‌స్టు నాటికే చేసుకోవాల‌న్న మాట‌ను గులాబీ అధినాయ‌కత్వం నుంచి క్లియ‌ర్ ఇండికేష‌న్లు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

దీంతో.. కీల‌క‌నేత‌ల శ్లేష మాట‌ల్ని అర్థం చేసుకున్న గులాబీ నేత‌లంతా ఎన్నిక‌ల‌కు అవ‌స‌ర‌మైన క్యాష్ ను ప‌క్కాగా స‌ర్దుబాటు చేసుకోవ‌ట‌మేకాదు.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏమేం చేయాల్సి ఉంటుంద‌న్న అంశాల‌పై ఇప్ప‌టికే ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పూర్తి చేసుకొని నింపాదిగా అన‌క రెఢీగా ఉన్నార‌ని చెప్పాలి.

ముంద‌స్తుపై ఉన్న ఇండికేష‌న్ల‌తో గులాబీ నేత‌లు అన్నింటికి రెఢీ కాగా.. కాంగ్రెస్ తో స‌హా విప‌క్ష నేత‌ల‌కు కిందా మీదా ప‌డుతున్నట్లుగా తెలుస్తోంది. ముంద‌స్తు వ‌స్తుంద‌న్న అనుమానం ఉన్నా.. అది నిజ‌మా?  కాదా? అన్న‌ది తేల‌క‌పోవ‌టంతో త‌గిన ఏర్పాట్లు చేసుకోలేద‌న్న మాట వినిపిస్తోంది. ఒక్క‌సారి ముంద‌స్తు డిక్లేర్ అయ్యాక‌.. ఏర్పాట్ల‌కు చాలానే అవ‌రోధాలు ఉంటాయి. ఇప్ప‌టికిప్పుడు భారీగా డబ్బు స‌మ‌కూర్చుకోవ‌టంతో పాటు. వాటిని సేఫ్ గా త‌ర‌లించ‌టం పెద్ద త‌ల‌నొప్పిగా చెబుతున్నారు. దీంతో.. ముంద‌స్తు గులాబీ బ్యాచ్ కి వ‌రంగా మ‌రితే.. విప‌క్షాల‌కు మాత్రం పెనుశాపంగా మారింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. గులాబీ నేత‌ల అడ్వాంటేజ్ చూస్తున్న విప‌క్ష నేత‌లు కుళ్లుకుంటున్నార‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News