పుష్కర కాలానికి పైనే ఉద్యమ రాజకీయం చేసినా.. టీఆర్ ఎస్ ను చడామడా తిట్టేసిన రాజకీయ పార్టీ కానీ రాజకీయ నేత కానీ పెద్దగా లేరనే చెప్పాలి. అంతోఇంతో గుర్తు పెట్టుకునే స్థాయిలో తిట్టిన వ్యవహారం ఉందంటే.. అది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణంలో హెలికాఫ్టర్ కూలి.. ఆకస్మికంగా మృతి చెందిన రాజశేఖర్ రెడ్డి మాత్రమే టీఆర్ ఎస్ నేతల్ని ఓ రేంజ్ లో ఏసుకున్నారు. ఆయన మరణించటానికి ముందు నిండు అసెంబ్లీలో నాటి టీఆర్ ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ను.. ‘‘ఏం రాజేందర్..’’అంటూ గద్దింపుతో పాటు.. గతంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పలు వ్యాఖ్యల మీదా ఆయన తీవ్ర ఆగ్రవాన్ని వ్యక్తం చేయటం అందరికి తెలిసిందే. వైఎస్ ఒక్కరు మాత్రమే కేసీఆర్ మీద కానీ.. టీఆర్ ఎస్ మీద కానీ విరుచుకుపడిందని చెప్పాలి.
ఆ తర్వాత ఎవరూ కూడా.. గులాబీ నేతల మీద ఆ స్థాయిలో నిప్పులు చెరిగింది లేదు. ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు.. టీఆర్ ఎస్ నేతల గురించి ప్రస్తావించటానికే భయపడిపోయిన దుస్థితి. తామేం మాట్లాడినా తిరిగి.. తిరిగి తమకెలా చుట్టుకుంటుందన్న భయం వారి నోట వెంట మాట రానీయకుండా చేసేది. ఇక.. కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేసిన ట్రాక్ రికార్డు రేవంత్ రెడ్డి మీద ఉంది. కానీ.. ఆయన మాటలు తీవ్రంగా ఉన్నప్పటికీ.. స్థాయిలో ఉంటే లెక్క వల్ల పెద్దగా పరిగణలోకి తీసుకోలేని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా వైఎస్ జగన్ అదే స్థాయిలో కేసీఆర్ తీరును ఎండగడుతున్నారు. నిన్నటికి నిన్న వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. వరంగల్ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ దిమ్మ తిరిగిపోయేలా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. గడిచిన 18 నెలల కాలంలో కేసీఆర్ సర్కారు ఏ విధంగా.. ఎన్ని రకాలుగా విఫలమైందీ ఆయన వివరంగా ప్రస్తావిస్తున్నారు. ఇంత భారీస్థాయిలో కేసీఆర్ ను విమర్శిస్తున్నా.. టీఆర్ ఎస్ నేతలు జగన్ మాటల్ని సీరియస్ గా తీసుకోకపోవటం విశేషం. ఇదే విషయాన్ని టీఆర్ ఎస్ నేతల దగ్గర ప్రస్తావిస్తే.. ఉనికి లేనోళ్లు ఎన్ని మాటలు మాట్లాడితే ప్రయోజనం ఉంటుందన్న ధీమాను వ్యక్తం చేయటం గమనార్హం. అయితే. అందరూ ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం లేదు. కొందరు గులాబీ నేతలు.. జగన్ మాటల మీద విపరీతమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన విషయాల గురించి తాము మాట్లాడలేం కానీ.. జగన్ మాటలు పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేవే అన్న మాటను చెబుతున్నారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యల మీద ఒక టీఆర్ ఎస్ నేత మాట్లాడుతూ.. ‘‘అయినా ఆ తిట్టుడేందన్నా. ప్రభుత్వం మీద గుస్సా వచ్చేలా మాట్లాడుతుండు. ఇక.. మేం గమ్మున ఉంటే మరింత కష్టం. హైకమాండ్ నుంచి ఆదేశాల కోసం చూస్తున్నం’’ అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.