తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్లటమే కాదు.. ఇప్పట్లో సాధ్యం కాదన్న దానిని.. సాధ్యమయ్యేలా చేసిన ఘనత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంతమని చెప్పాలి. ఉద్యమ పార్టీగా సుపరిచితమైన తన పార్టీని నూటికి నూరు శాతం రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పటం.. అందుకు తగ్గట్లే ఆయన తీసుకున్న నిర్ణయాలు పలువురిని విస్మయానికి గురి చేశాయి. నీతులు చెప్పే పెద్ద మనిషి.. తాను చెప్పే విలువలకు భిన్నంగా వ్యవహరించటం ఏమిటన్న ప్రశ్నకు సింగిల్ లైన్ లో చెబుతున్న సమాధానం.. 'రాజకీయ పార్టీగా మారుతున్నట్లు చెప్పాం కదా? రాజకీయం అన్న తర్వాత ఇలాంటివి కామన్' అన్న రీతిలో గులాబీ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.
తనను ఇరుకున పడేసే ప్రత్యర్థులకు ఆ అవకాశం ఇవ్వకుండా.. తానే ముందుగా దెబ్బేసే అలవాటున్న టీఆర్ఎస్ పార్టీ.. తన సహజ సిద్ధమైన పోరాట పటిమను పక్కన పెట్టేసి.. ఆత్మరక్షణలో ఆట ఆడటం షురూ చేసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అంశం ఏదైనా సరే.. తనదైన రీతిలో స్పందిస్తూ.. ఎజెండా సెట్ చేస్తూ.. మిగిలిన రాజకీయ పార్టీలు సైతం తాను సిద్ధం చేసిన ఎజెండాకు తగ్గట్లుగా గళం విప్పక తప్పనిసరి పరిస్థితిని తీసుకొచ్చేది.
ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా విపక్షాలు సిద్ధం చేసిన ఎజెండాను అనివార్యంగా ఫాలో అయిపోతున్న తీరుతో గులాబీ నేతలతో పాటు.. మిగిలినవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ మధ్యన గులాబీ పార్టీకి.. గులాబీ బాస్ కు ఏమైందన్నది ప్రశ్నగామారింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. బీజేపీ సిద్ధం చేసిన ఎజెండాకు తగ్గట్లు ముఖ్యమంత్రి.. ఆయన ప్రభుత్వం ఫాలో అవుతూ.. వారికి తగ్గట్లుగా రియాక్టు కావటం కనిపిస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
బీజేపీతో పోటీ పడి వారి కంటే తాను పైచేయిలో ఉన్నానన్న అల్పానందాన్ని పొందుతున్న గులాబీ నేతలు.. అసలు ఎజెండా సెట్ చేసిందే తాను అయినప్పుడు..ఈ ఆనందం కూడా తన స్క్రిప్టులో భాగమేనన్న విషయాన్ని టీఆర్ఎస్ అధినేత మిస్ అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. ఇటీవల భారత స్వాతంత్య వజ్రోత్సవాలు.. సెప్టెంబరు 17 సంబురాలే దీనికి నిదర్శనంగా చెప్పాలి.
సాధారణంగా.. ఇలా డిమాండ్ చేసి.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలాచేయటం కేసీఆర్ కు అలవాటు. అంతేతప్పించి.. ఎవరో ఏదో చెబితే చేసే అలవాటు ఆయనకు ఉండదు.
కానీ.. ఈ రెండు ఉదంతాల్లో మాత్రం ఆయన ఒత్తిడితో నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఆయనపై తాము పెట్టిన ఒత్తిడి ఫలించిందని.. తాము కోరుకున్నట్లే పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటివి మరో రెండు మూడు ఉదంతాలు చోటు చేసుకుంటే.. కేసీఆర్ ను ఎలా ప్రభావితం చేయాలన్న దానిపై విపక్షాలు ఒక అంచనాకు వచ్చేయటం ఖాయమంటున్నారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాలు..సెప్టెంబరు 17న నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవాలు తమ విజయంగా గులాబీ నేతలు కొందరు భావిస్తున్నా..అదంతా కూడా బీజేపీ పన్నిన ఉచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పాటైన ఎనిమిదేళ్లలో లేనిదంతా ఇప్పుడే ఎందుకు హడావుడి చేస్తున్నట్లు? అన్న ప్రశ్నకు టీఆర్ఎస్ నేతలు ఎవరి వద్దా సమాధానం లేని పరిస్థితి. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు విమోచన ఉత్సవాల్ని అధికారికంగా నిర్వహిస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అందుకు భిన్నంగా జాతీయ సమైక్యత అంటూ ఆయన నోటి నుంచి వస్తున్న మాటలకు ప్రతిగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇలాంటి తీరు ఏ మాత్రం సరి కాదని.. గులాబీ కారు రాంగ్ రూట్లోకి వెళుతుందన్న మాట వినిపిస్తోంది. రాంగ్ రూట్ లోకి వెళ్లేలా వేసిన ఎత్తులో గులాబీ బాస్ చిక్కుకున్నట్లుగా చెబుతున్నారు. మరిప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరుస్తారా? తాను చేస్తున్న పనులు.. తీసుకుంటున్న నిర్ణయాలపై ఆత్మవిమర్శ చేసుకుంటారంటారా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.