తెలంగాణలో అధికార పార్టీ పరిస్థితి రాజకీయాలు ఆసక్తిగా మారిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీఆర్ ఎస్ పార్టీకి అధికార ప్రతినిధులు కరువయ్యారు. పార్టీపై ఏ విమర్శలొచ్చినా మంత్రులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. విపక్షాల విమర్శలకు, ఆరోపణలకు ఎప్పుడు చూసినా స్పందిస్తోంది ఆ నలుగురైదుగురు మంత్రులే.
అధికారంలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ యాక్టివిటీని తగ్గించింది టీఆర్ ఎస్. ప్రభుత్వ పథకాలు, అధికారిక కార్యక్రమాల మీదే ఎక్కువగా దృష్టిపెట్టింది. ఏ అధికార పార్టీ అయినా ఓవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని సమన్వయంతో నడిపించాలి. కానీ టీఆర్ ఎస్ విషయంలో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటినా...పార్టీ పదవుల భర్తీ జరగలేదు. దీనికి తోడు నామినేటెడ్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మూడు నెలలు దాటినా... పార్టీ పదవుల భర్తీ కొలిక్కిరాకపోవడంతో టీఆర్ ఎస్ తరఫున వాయిస్ వినిపించేవారు కరువయ్యారన్న చర్చ పార్టీలో జరుగుతోంది.
పార్టీ తరఫున మాట్లాడేవాళ్లు లేకపోవడంతో...విమర్శలకు మంత్రులు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. కొందరు పార్టీకి దూరమైతే... ఉన్నవారిలో మరికొందరు సైలెంట్ గా ఉన్నారు. అరడజను మంది అధికార ప్రతినిధులు, పోలిట్‌బ్యూరో సభ్యులతో పార్టీ కమిటీ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటే పొలిటికల్ యాక్టివిటీ చురుగ్గా ఉండేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ ఊసే లేదు. జిల్లాల సంగతి తర్వాత... త్వరలో ఎన్నికలు రానున్న గ్రేటర్ సంగతి ఏంటని టీఆర్ ఎస్ లోనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు గ్రేటర్ కు కమిటీ లేదు. వ్యూహాలు, రాజకీయ చతురత పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా... కమిటీలు లేకుండా ఎన్నికల వ్యూహం వర్కవుట్ అయ్యే అవకాశాలుండవన్న చర్చ గ్రేటర్ నేతల్లో జరుగుతోంది. ఓవరాల్ గా పార్టీ తరఫున గొంతు వినిపించే బలమైన నేతల కొరత టీఆర్ ఎస్ లో స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు