తెలంగాణలో కారు జోరు కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయ దుందుభి మోగించింది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ తరఫున బరిలో నిలిచిన సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వర్ రావు 45,750 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి- కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత రెడ్డిపై తుమ్మల విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి సుచరితా రెడ్డి - సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్ పోటీ చేశారు. టీడీపీ - వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వగా...బీజేపీ పోటీచేయడంలేదని, ఎవరికీ మద్దతివ్వబోమని ప్రకటించింది.
తాజా గెలుపుతో ఎన్నికలేవైనా సరే గెలుపు టీఆర్ ఎస్ దేనని నిరూపించినట్లయిందని రాజకీయవర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానే ఆ పార్టీని ప్రతిపక్షాలు కొద్దిగా నిలువరించగలిగాయి. అయితే అనంతరం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ రికార్డు స్థాయి విజయం సాధించింది. తాజా విజయంతో టీఆర్ ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగినట్లయిందని చర్చ నడుస్తోంది.
పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనను భారీ మెజార్టీతో గెలిపించడం పట్ల పాలేరు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈ విజయంతో టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు.ఉప ఎన్నికల విజయంపై స్పందించేందుకు గులాబీ దళపతి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.