టీఆర్ ఎస్‌కు ఉప ఎన్నిక‌ను మించిన ప‌రీక్ష‌!

Update: 2022-10-07 08:30 GMT
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి.. ఉప ఎన్నిక ముహూర్తం ఖ‌రారైంది. షెడ్యూ ల్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. వ‌చ్చే నెలలో ఎన్నిక పూర్తి కానుంది. అయితే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు అత్యంత  కీల‌కంగా మారింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు వ‌స్తున్న ఈ ఉప పోరు ద్వారా.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త లేద‌నే సంకేతాల‌ను పంపించాల‌ని కేసీఆర్‌.. భావిస్తున్నా రు.

దీనికి సంబంధించి ఆయ‌న అనేక వ్యూహాల‌ను కూడా రెడీ చేసుకున్నారు. క్షేత్ర‌స్థాయిలో పార్టీని ముం దుండి న‌డిపిస్తున్నారు. ప్ర‌తి విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు.

అయితే.. ఎన్ని చేసినా.. అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌నే కీల‌కం. దీనిపై  కొన్నాళ్లుగా క‌స‌ర‌త్తు చేసిన కేసీఆర్‌.. తాజాగా కూసుకుంట్ల   ప్ర‌భాక‌ర్‌రెడ్డి వైపే మొగ్గు చూపారు.  ఆయ‌న‌కే మ‌ళ్లీ టికెట్ కేటాయించారు.

అయితే.. ఎవ‌రిని ఎంపిక చేసినా.. ముగ్గురు కీల‌కంగా.. ఇక్క‌డ విజ‌యాన్ని నిర్ణ‌యిస్తార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా.. న‌లుగురు అభ్య‌ర్థులు మునుగోడు టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరిలో కూసుకుంట్ల ప్ర‌భాకర్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ నేత కర్నాటి ప్రభాకర్ కీల‌కంగా ఉన్నారు. వీరిలో ఎవ‌రికి టికెట్ ఇచ్చినా.. ముగ్గురినీ ప్ర‌స‌న్నం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే.. విజ‌యం తారుమార‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు.

దీనికికార‌ణం.. ఈ నలుగురు కూడా.. మునుగోడుపై ప‌ట్టున్న నాయ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం. కూసుకుంట్ల కు ఇచ్చేసిన నేప‌థ్యంలో  మిగిలిన ముగ్గురు నాయ‌కులు బూర‌, క‌ర్నె, క‌ర్నాటి ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది చూడాలి.

వీరికి క్షేత్ర‌స్థాయిలో ఉన్నప‌ట్టు నేప‌థ్యంలో వీరిని యాక్టివ్ చేసుకోకుండా.. పార్టీ ముందుకు వెళ్లినా.. ప్ర‌యోజ‌నం లేద‌నే టాక్ వినిపిస్తోంది. మిగిలిన ఆశావ‌హులు కూడా.. భారీగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఈ ముగ్గురు  మాత్రం అత్యంత కీల‌కం. మ‌రి కేసీఆర్ వీరిని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News