సంక్రాంతి అన్నంతనే రంగవల్లులు గుర్తుకు వస్తాయి. డిజిటల్ ప్రపంచంలోనూ లెక్క మిస్ కాకుండా ఇప్పటికి గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో మహిళలు వేసే ముగ్గులు మనసుల్ని దోచేస్తుంటాయి. ఒకప్పుడు సంక్రాంతి సీజన్ కు కనీసం రెండు వారాల పాటు తెలుగు లోగిళ్లన్ని ముగ్గులతో మెరిసిపోయేవి. దీనికోసం ఎంతో కసరత్తు చేసేవారు. హైదరాబాద్ మహానగరంలో కాస్త తక్కువ కనిపించినా.. చాలామంది ఉత్సాహంగా ముగ్గులు వేయటం కనిపిస్తూనే ఉంటుంది.
తెలంగాణ విషయానికి వస్తే.. ఈసారి సంక్రాంతి మున్సిపల్ ఎన్నికలతో కలిసి రావటం ఆసక్తికరంగా మారింది. ముగ్గులతో తాము అభిమానించే పార్టీల ముగ్గులు వేసేసి అదరగొట్టేస్తున్నారు మహిళామణులు. తాజాగా అలాంటి ప్రయత్నమే చేశారు సిరిసిల్లకు చెందిన 200 మంది మహిళలు. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో 200 మంది మహిళలు కలిసి భారీ ముగ్గును ప్లాన్ చేయటమే కాదు.. దాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వారు వేసిన ఈ భారీ ముగ్గు మరేమిటో కాదు.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎన్నికల గుర్తైన కారు బొమ్మను వారు వేశారు. కేవలం మూడున్నర గంటల వ్యవధిలో ఇంత భారీ ముగ్గును వేసేసిన వారు తమ టాలెంట్ ఏమిటో ప్రదర్శించారు. ఈ ముగ్గును చూసేందుకు సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారంతా భారీగా వచ్చి వీక్షించారు.
చివరకు ఈ ముగ్గు వ్యవహారం రాష్ట్ర మంత్రి కమ్ టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకూ వెళ్లింది. ఆ ముగ్గును చూసిన ఆయన ఫిదా కావటమే కాదు.. ముగ్గు వేసిన మహిళల్ని ప్రసంశించారు కూడా. దీంతో.. ముగ్గు వేసిన మహిళామణులంతా తమ శ్రమను ఇట్టే మర్చిపోయారని చెప్పాలి.