'సూపర్ సక్స్' లో సెకండ్ వన్ కూడా కొబ్బరికాయ రెడీ!!
అలాగే సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటు న్నట్టు మంత్రి ప్రకటించారు.
ఏపీలో ఎన్నికలకు ముందు టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీలు ఇచ్చిన(వాస్తవానికి టీడీపీదే) సూపర్ సిక్స్ హామీల అమలు.. శుక్రవారం నుంచి ప్రారంభమైంది. తొలుత.. ఉచిత గ్యాస్ పంపిణీకి శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మహిళలకు ఏటా మూడు వంటగ్యాస్ సిలిండర్లను ఈ పథకంలో అందించనున్నారు. మొత్తం ఎమౌంటును ప్రభుత్వమే భరించనుంది. ఈ పథకానికి భారీ స్పందన వచ్చింది. సుమారు 6 లక్షల మంది ఇప్పటికే బుక్ చేసుకున్నట్టు సర్కారు ప్రకటించింది.
మొత్తం 90 లక్షల మంది ఈ పథకంలో లబ్ధి పొందనున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు మరో కీలకమైన.. సూపర్ సిక్స్ పథకానికి కూడా కూటమి సర్కారు కొబ్బరి కాయ కొట్టేసేందుకు సర్కారు రెడీ అయినట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. 2025, సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని.. ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని తెలిపారు
అలాగే సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటు న్నట్టు మంత్రి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలు నిత్యం ప్రజారవాణాని వినియోగించు కుంటున్నారని.. వీరికి పూర్తి ఉచితంగా ఆర్టీసీ బస్సులు తీసుకురానున్నామన్నారు. ఇలాంటి ఉచిత ఆర్టీసీ బస్సు పథకం అమలవుతున్న తెలంగాణ, కర్ణాటకలో పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారన్న విషయంపై అధ్యయనం చేశామన్నారు.
ఆయా రాష్ట్రాల్లో కంటే కూడా మెరుగ్గా.. ఏపీలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్న జనార్దన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు 300 కోట్ల రూపాయలకు పైగానే భారం పడుతుందన్నారు. అయినప్పటికీ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. అమలు చేయాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నట్టు చెప్పారు. విపక్షాలు దీనిపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని, సూపర్ సిక్స్‌లో చెప్పిన అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు.